టీడీపీ ఎమ్మెల్యే ముద్దుల వీడియోలో భారీ ట్విస్ట్- ఆమె భర్తే లీక్ చేశాడా ? మరో మహిళ షాకింగ్..!
టీడీపీకి చెందిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ ఓ మహిళతో వీడియో కాల్ లో మాట్లాడుతూ ముద్దులు పెడుతున్న దృశ్యాలు గతంలో వైరల్ అయ్యాయి. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ వీడియో వ్యవహారం తేల్చాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అదే సమయంలో వీడియోలో ఉన్న టీడీపీ మహిళా నేత గుంటుపల్లి వాణి ఓ వీడియో రిలీజ్ చేశారు. తన భర్తతో వీడియో కాల్ మాట్లాడిన వీడియోను డీప్ ఫేక్ చేసి ఎమ్మెల్యేను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.
తన ఫోన్ ను హ్యాక్ చేసి తాను, తన భర్త రైలులో వెళ్ళేటప్పుడు తీసుకున్న సెల్ఫీ వీడియోలను మార్ఫ్ చేసి.. తాను ఎమ్మెల్యే నజీర్ తో వీడియో కాల్ మాట్లాడుతున్నట్లు డీప్ ఫేక్ చేసి ప్రచారం చేస్తున్నారని గుంటుపల్లి వాణి గతంలో ఆరోపించారు. తన వీడియోను డీప్ ఫేక్ చేసిన వారిపై చట్టపరంగా పోరాడతానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత పోలీసులు ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించి అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే ఈ కేసులో ఎలాంటి పురోగతి సాధించలేదు.

ఈ నేపథ్యంలో పోలీసులు ఈ కేసులో అనుమానితురాలిగా భావించి ప్రశ్నించిన మరో టీడీపీ నాయకురాలు సోఫియా ఓ వీడియో విడుదల చేశారు. టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కు తెలుగుదేశం నాయకురాలు వాణికు మధ్య ఎఫైర్ ఉన్న మాట వాస్తవమని ఆమె తేల్చేశారు. వాణి భర్త నవీన్ కృష్ణే తనకు ఈ విషయం చెప్పాడని ఆమె బాంబు పేల్చారు. తాను తన భార్యను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ దగ్గరకు తీసుకు వెళ్లే వాడినని నవీన్ కృష్ణ తనకు చెప్పాడన్నారు.
నవీన్ కృష్ణ తన భార్య వాణి ఫోను హ్యాక్ చేశాడని, వాణి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుకునేవి కాల్స్ అన్ని వింటూ ఉండేవారని సోఫియా ఆరోపించారు. వాణి, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కు సంబంధించిన వీడియోలు నవీన్ కృష్ణ దగ్గర ఉన్నాయన్నారు. నిజాలు అందరికీ తెలియాలని తాను నాలుగు రోజుల క్రితం ఒక వీడియో చేశానన్నారు. తాను నసీర్ అహ్మద్ దగ్గరికి వెళ్లి వాణి భర్త దగ్గర మీ వీడియో లు ఉన్నాయని చెప్పానని వెల్లడించారు.
ఈ విషయాలు పోలీసులతోపాటు ఇంకెవరి దగ్గరా చెప్పొద్దని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తనను రెండు రోజులు టైం అడిగాడన్నారు.
ఇప్పుడు వాళ్లు అందరూ ఏకమైపోయి ఈ వ్యవహారాన్ని తన మీద నెట్టడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. పోలీసులు తమ కుటుంబ సభ్యుల్ని తరచూ పోలీస్ స్టేషన్ పిలిపించి వేధిస్తున్నారన్నారు. ఈ వేధింపులు భరించలేక తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానన్నారు.

వాణి భర్తను అదుపులోకి తీసుకుని విచారించి ఆయన ఫోన్ ను స్వాధీనం చేసుకుంటే అన్ని వీడియోలు బయటకు వస్తాయన్నారు. వాణి ,ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వీడియో నవీన్ కృష్ణ బయటికి విడుదల చేశాడని, కాబట్టి ఈ దంపతులతో పాటు వాళ్ళ బంధువు విజయ్ కృష్ణను ప్రశ్నిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications