రాయలసీమ ప్రాజెక్టులకు భారీ వరద-శ్రీశైలం, తుంగభద్ర, సోమశిలలో అదే పరిస్ధితి...

ఏపీలో తరచుగా కరువ బారిన పడే రాయలసీమ జిల్లాల్లో ఇప్పుడు జలసిరి కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వరద ప్రవాహాలు పెరగడంతో ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. పలు ప్రాజెక్టుల్లో గత కొన్నేళ్లలో ఎప్పుడూ లేనంత వరద ప్రవాహం కనిపిస్తోంది. దీంతో రైతులు పండగ చేసుకుంటున్నారు.

కర్నూలు జిల్లా తుంగభద్ర జలాశయానికి వరద భారీగా పెరుగుతోంది. దీంతో 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్ర ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టం 1633 మీటర్లు కాగా, ప్రస్తుతం ఇది 1632.44 మీటర్లకు చేరుకుంది. ప్రస్తుతానికి ఇన్ ఫ్లో 46263 క్యూసెక్కులు కొనసాగుతుండగా.. 34617 క్యూ సెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 105.788 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 103.540 టీఎంసీలకు చేరింది.

heavy flooding to rayalaseema projects with inflows in krishna, tungabhadra, penna rivers

అటు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టులో 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ లోకి 3,56,442 క్యూసెక్కులు ఇన్ ఫ్లో, 4,40,991 క్యూసెక్కులు ఔట్ ఫ్లో ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.80 అడుగులకు చేరింది. భారీ వరద ప్రవాహాలతో శ్రీశైలం కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. మరోవైపు సుంకేసుల ప్రాజెక్టుకూ వరద ప్రవాహం కొనసాగుతోంది ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 27 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సుంకేశులలో ఇన్ ఫ్లో 1,42,539 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో 1,40,274 క్యూసెక్కులకు చేరుకుంది.

అటు సోమశిల ప్రాజెక్టులోకీ భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆరు క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సోమశిల ప్రాజెక్టు పూర్తి కెపాసిటీ 78 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 71.29 టీఎంసీలకు మట్టాలు చేరుకున్నాయి. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 44,493 క్యూసెక్కులుగా కాగా.. ఔట్‌ఫ్లో 60,453 క్యూసెక్కులకు చేరింది. ఆయా ప్రాజెక్టుల్లో వరద ప్రవాహం మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతాల్ని అప్రమత్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+