Heavy Rains: ఉధృతంగా గోదావరి; భద్రాచలం, పోలవరం వద్ద పరిస్థితి ఇదే!!
భారీ వర్షాలతో గోదావరి నదికి వరద ఉధృతి బాగా పెరుగుతుంది. అటు ప్రాణహిత, ఇటు ఇంద్రావతి నుంచి వస్తున్న ప్రవాహంతో గోదావరి కి వరద కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఎగువన కురిసిన వర్షాలతో గోదావరి నిండుకుండను తలపిస్తోంది. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతంలోని ప్రాజెక్టుల నుండి వస్తున్న వరద వల్ల భద్రాచలం వద్ద గోదావరి 43 అడుగులు మొదటి హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉంది.
ఈ రోజు ఉదయం 7 గంటలకు 39.10 అడుగులకు చేరినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక తెలిపారు. దిగువకు 7 లక్షల 66 వేల 842 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ యంత్రాంగపు సూచనలు, సలహాలు పాటించాలని ప్రజలకు సూచించారు.

ముంపుకు గురయ్యే వరకు వేచి ఉండకుండా ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని, గ్రామ, మండల, జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రోడ్లపైకి నీరు చేరిన ప్రాంతాల్లో రవాణా సేవలు నిలిపి వేయాలని, రాకపోకలు నియంత్రణకు పటిష్ట బారికేడింగ్, ప్రమాదహెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. జాలర్లు చేపల వేటకు వెళ్ళొద్దని, పశువులను ఆరుబయట మేతకు వదలకుండా ఇంటి వద్దనే ఉంచాలని, రక్షణకు ఎతైన ప్రాంతంలో ఉంచాలన్నారు.
గోదావరి వరద వల్ల ఏలూరు జిల్లా పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటిమట్టం 30.680 మీటర్లుగా నమోదైంది. ప్రస్తుతం ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా 3,15,791 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గోదావరి నదికి పెరుగుతున్న క్రమంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేసింది. కాగా అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలో గోదావరి ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో గండి పోచమ్మ అమ్మవారి ఆలయం గోపురం వరకు వరద నీరు చేరింది.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications