బాలయ్యా ఎక్కడయ్యా..షూటింగ్సే ముఖ్యమా ? హిందూపూర్ గ్యాంగ్ రేప్ పై వైసీపీ దీపిక..!
హిందూపురంలో అత్తా కోడళ్లపై గ్యాంగ్ రేప్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటన తర్వాత ప్రభుత్వం స్పందన ఎలా ఉన్నా హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణ మౌనంగా ఉండటంపై వైసీపీ మండిపడుతోంది. బాలయ్య తీరుపై హిందూపురం వైసీపీ ఇన్ ఛార్జ్ టీఎన్ దీపిక ఇవాళ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన ఎక్కడున్నారని, హిందూపురంలో గ్యాంగ్ రేప్ జరిగితే స్పందించే సమయం లేదా అని సూటిగా ప్రశ్నించారు.
హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం నల్లబొమ్మినిపల్లెలో ఇద్దరు మహిళలపై గ్యాంగ్ రేప్ ఘటన అత్యంత అమానుషం, దారుణమని హిందూపురం వైసీపీ సమన్వయకర్త దీపిక తెలిపారు. దేశవ్యాప్తంగా విజయదశమి జరుపుకుంటుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన వందరోజుల్లో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోవడం అత్యంత దారుణమన్నారు.

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మీరు ఎక్కడ ఉన్నారు, మీరు ఇక్కడి నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, హిందూపురం ప్రజలకు ఏదైనా జరిగితే సిట్టింగ్ ఎమ్మెల్యే కనిపించరు, ఆయన సినిమా షూటింగ్‌లలో బిజీగా ఉంటారు తప్ప నియోజకవర్గాన్ని పట్టించుకోరంటూ దీపిక తీవ్ర విమర్శలు గుప్పించారు. కనీసం పోలీసులు అయినా వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నట్లు దీపిక తెలిపారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటారు, అవి కాదు కావాల్సింది, మహిళలకు రక్షణ కావాలి, మీరేం చేస్తున్నారు, సనాతన ధర్మం కాపాడడానికి సాధువులు, సంతువులు చాలామంది ఉన్నారు, ముందు మీరు డిప్యూటీ సీఎంగా మహిళల మాన ప్రాణాలు కాపాడండి అంటూ దీపిక పవన్ కు సూచించారు. అలాగే హోంమంత్రి అనిత, మంత్రి సవిత ఎక్కడున్నారు, మీరు ఇంతవరకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇంత దారుణం జరిగితే మీరు రావాల్సిన బాధ్యత లేదా, జగనన్నను విమర్శించడం తర్వాత ముందు మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండంటూ హితవు పలికారు.












Click it and Unblock the Notifications