చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్ట్ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు!

రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంలో జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది ఎన్డీయే కూటమి ప్రభుత్వం. అమ‌రావ‌తిని ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ వ‌న్ సిటీగా రూపుదిద్దాల‌నుకుంటున్న సీఎం చంద్ర‌బాబు ల‌క్ష్యానికి అనుగుణంగా అన్ని విధాలుగా అమరావతి నిర్మాణానికి సహాయ సహకారాలు అందుతున్నాయి. అమ‌రావ‌తి నిర్మాణం కోసం వివిధ బ్యాంకులు,సంస్థ‌లు త‌మ స‌హ‌కారం అందించేందుకు సానుకూలత వ్యక్తం చేస్తున్నాయి.

అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు
తాజాగా అమరావతి నిర్మాణం విషయంలో మరో కీలక అడుగు పడింది. అమ‌రావతి నిర్మాణం కోసం ఏపీసీఆర్డీయేకు 11 వేల కోట్ల రుణం మంజూరుకు హడ్కో అంగీకారం తెలిపింది.ఇప్ప‌టికే గ‌త శ‌నివారం అమ‌రావ‌తి పునఃనిర్మాణ ప‌నుల‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్రారంభించారు. రాజ‌ధానిలో భ‌వ‌నాలు,ఇత‌ర మౌళిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు సంబంధించి నిర్ధేశిత గ‌డువును పెట్టుకుని ముందుకు వెళ్తున్న ప్రభుత్వానికి హడ్కో కూడా శుభవార్త చెప్పింది.

HUDCO agreed to give 11 000 crore rupees for Chandrababu dream project capital Amaravati construction

11 వేల కోట్లు రుణం ఇచ్చేందుకు హడ్కో గ్రీన్ సిగ్నల్
రాజ‌ధాని నిర్మాణానికి ఏపీసీఆర్డీఏకు 11 వేల కోట్లు రుణం ఇవ్వ‌నున్నామని సుముఖతను వ్యక్తం చేసింది హ‌డ్కో . రాజ‌ధాని నిర్మాణంలో మొద‌టి విడ‌త ప‌నుల పూర్తికి 26 వేల కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌ని ఏపీ ప్రభుత్వం అంచనా వేసింది.ఈ నిధుల స‌మీక‌ర‌ణ కోసం కూట‌మి ప్ర‌భుత్వం దృష్టి సారించింది. ఇప్ప‌టికే ప్ర‌పంచ బ్యాంకు,ఆసియా డెవ‌ల‌ప్ మెంట్ బ్యాంకు క‌లిసి 15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకారం తలిపై.

హడ్కో అధికారులకు రాజధాని అమరావతి ప్లాన్ వివరించిన మంత్రి
ఇక మిగిలిన 11 వేల కోట్ల నిధుల మంజూరుకు హ‌డ్కో అంగీకారం తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో ప‌ర్య‌టించిన మున్సిప‌ల్ మ‌రియు ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌,ఆ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనిల్ కుమార్ సింఘాల్ హ‌డ్కో అధికారుల‌తో సమావేశమై ఈ మేరకు చర్చలు జరిపారు. అమ‌రావ‌తి నిర్మాణానికి సంబంధించి ప్ర‌భుత్వ ఆలోచ‌న‌ను హ‌డ్కో అధికారుల‌కు పూర్తి స్థాయిలో మంత్రి నారాయ‌ణ‌ వివ‌రించారు.

26 వేల కోట్లతో మొదటి దశ అమరావతి నిర్మాణం
ప్ర‌భుత్వ ప్ర‌తిపాద‌న‌ల‌కు సంతృప్తి చెందిన హ‌డ్కో సీఈవో అమ‌రావతి నిర్మాణం కోసం ఏపీసీఆర్డీయేకు 11 వేల కోట్ల రుణం మంజూరుకు అంగీకారం తెలిపారు. ఇక ఈ నిధులు కూడా విడుదలైతే అమరావతి నిర్మాణంలో మొదటి దశ వేగంగా పూర్తి అవుతుందని అంచనా. మొత్తం 26 వేల కోట్లతో మొదటి దశ అమరావతి నిర్మాణం జరగనుంది. వరల్డ్ క్లాస్ నగరంగా అమరావతి రూపు దిద్దుకోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+