వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు దుమారం... దేవాన్ష్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉందా...?

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై పెద్ద దుమారమే రేగుతోంది. ప్రభుత్వ పాఠాశాలల్లో ఇంగ్లీష్ మీడీయం ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రతిపక్ష పార్టీలతోపాటు ఇతర ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున విమర్శల పాలు అవుతోంది.. దీంతో అధికార పార్టీ వర్గాలు సైతం అంతే స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఈనేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. రాజకీయ విమర్శల నుండి వ్యక్తిగత విమర్శల వరకు వెళుతోంది. ఈ నేపథ్యంలోనే అటు పవన్ కళ్యాన్‌ సంతానం తోపాటు చంద్రబాబునాయుడు మనవడిని సైతం తెలుగువివాదం తాకింది.

 విపక్షాలకు దీటుగా అధికారపార్టీ నేతలు

విపక్షాలకు దీటుగా అధికారపార్టీ నేతలు

తెలుగు నిర్ణయం రాజకీయ విమర్శల స్థాయి నుండి కుటుంబాలు వ్యక్తిగత అంశాలపై కూడ ఇరుపార్టీల నేతలు విమర్శలు చెసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్‌ను సైతం తెలుగు బాష విమర్శలు తాకాయి. రాష్ట్రవ్యాప్తంగా మనబడి నాడ -నేడు కార్యక్రమంలో పాల్గోన్న పలువురు రాష్ట్రమంత్రులు టీడీపీ విమర్శలను తిప్పి కొట్టారు. ముఖ్యంగా భవిష్యత్‌లో ఇంగ్లీష్ మీడియం పాఠాశాలల అభివృద్దికి ముఖ్యమంత్రి జగన్ కట్టుబడి ఉన్నాడని.. ఇందుకోసం ఎన్ని విమర్శలు ఎదురైన పథకాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

పరోక్షంగా వెంకయ్యనాయుడు, రామోజీ స్కూళ్లపై విమర్శ

పరోక్షంగా వెంకయ్యనాయుడు, రామోజీ స్కూళ్లపై విమర్శ

ఇక చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్ చదివే స్కూల్లో తెలుగు మీడియం లేదని మంత్రి సురేశ్ చెప్పారు. మరోవైపు రాజ్యంగపదవుల్లో ఉండి ట్రస్టులు నడుపుతున్న వారంటూ పరోక్షంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతోపాటు మరో పత్రిక అధినేత నడుపుతున్న స్కూళ్లో తెలుగు మీడియం ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు. తెలుగుమీడియంపై కేవలం రాజకీయం కోసమే రాద్దాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈనేపథ్యంలోనే ఇది దళితులు, ఇతర బీదవర్గాలకు ఎక్కువగా ఉపయోగపడే పథకాన్ని వారు వ్యతిరేకిస్తున్నారని ఆయన విమర్శించారు..

 పెద్దవారికే ఇంగ్లీష్ మీడియం చదువులా...

పెద్దవారికే ఇంగ్లీష్ మీడియం చదువులా...

మరోవైపు పెద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందిస్తే తప్పేంటని మరోమంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రశ్నించారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. ఇందుకోసమే విద్యాశాఖకు 33 కోట్ల రుపాయలను కేటాయించిందని ఆయన తెలిపారు. పెదవారికి ఇంగ్లీష్ మీడియంలో చదువుకునేందుకు అవకాశం కల్పిస్తే... చంద్రబాబు నాయుడుతో పాటు, పవన్ కళ్యాణ్‌లు విమర్శించడం దారణమని అన్నారు. చంద్రబాబునాయుడుతో తన మనవడిని, పవన్ కళ్యాణ్ తన పిల్లల్ని ఏమీడియంలో చదివిపిస్తున్నారో చెప్పాలని అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ మరో పదిహేను రోజుల్లో సినిమాల్లో నటించేందుకు సిద్దమయ్యారని, బాలినేని వ్యాఖ్యానించారు.

English summary
IS there english medium in the devaansh school.whose Grandson of chandrababu naidu. the ap ministers asked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X