వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసే ఇప్పించింది: జగన్ బెయిల్‌పై శోభా హైమవతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Shobha Hymavathi
విజయనగరం/ హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ బెయిల్ ఉహించిందేనని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శోభా హైమావతి వ్యాఖ్యానించారు. సోమవారం విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ఆమె మీడియాతో మాట్లాడారు. తల్లి కాంగ్రెస్ పిల్లకాంగ్రెస్ నేత జగన్‌కు బెయిల్ ఇప్పస్తుందని తమకు ముందే తెలుసన్నారు. సిబిఐ జెడి లక్ష్మీనారాయణను బాధ్యతలనుంచి ఇందుకే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించిందన్నారు. రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గ్రహించారని ఆమె అన్నారు.

తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సమితితోను, సీమంధ్రలో జగన్ పార్టీతోను పొత్తు పెటుకుని వచ్చే ఎన్నికల్లో నెగ్గుకు రావాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు పూనుకుందన్నారు. ఇందులో భాగంగానే జగన్‌కు కోర్టులో బెయిల్ వచ్చేవిదంగా సిబిఐని పావులా వాడుకున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర 53రోజులుగా రగిలిపోతుంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చోద్యం చుస్త్తుని వ్యాఖ్యానించారు. జగన్‌కు బెయిల్ ఇప్పించడంలో వున్న శ్రద్ధ తెలుగు వారిని ఐక్యంగా ఉంచడంలో చూపించడం లేదన్నారు.

సిబిఐ, ఈడీ సంస్ధల దర్యాప్తునకు బ్రేకులు వేయడం ద్వారా కాంగ్రెస్ సహకరించకపోతే జగన్‌కు బెయిల్ వచ్చేదా అని తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు. జగన్ బెయిల్ అడ్డుకోవడానికే చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారని నిన్నటిదాకా ఆయన పార్టీ నేతలు ఆరోపించారని, ఇప్పుడు ఆయనకు బెయిల్ ఎలా వచ్చిందని సోమిరెడ్డి ప్రశ్నించారు.

ఈ బెయిల్ తమకు ఆశ్చర్యం కలిగించలేదని, ఇది తాము ఊహించిందేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇది స్పష్టమైన రాజకీయ ఒప్పందమని, జగన్‌పై ఐదు ఛార్జిషీట్లు వేయడానికి సిబిఐ ఆరు వందల రోజుల సమయం తీసుకుందని, మరో ఐదు ఛార్జిషీట్లను కేవలం వారం రోజుల్లో వేసేసిందని ఆయన అన్నారు. ఎనిమిది కంపెనీలపై ఆధారాలు లేవని సిబిఐ చెబుతోందని, ఇండియా సిమెంట్స్ కంపెనీ రూ. 130 కోట్ల ముడుపులను కార్మెల్ ఆసియా కంపెనీ ద్వారా జగన్ కంపెనీల్లో పెట్టుబడుల రూపంలో పెట్టిందని సిబిఐ ఒక ఛార్జిషీట్లో ఆరోపించిందని ఆయన అన్నారు.

ఈ రోజు కోర్టులో వేసిన మెమోలో కార్మెల్ ఆసియాపై ఏ ఆధారాలు లేవని అంటోందని, ఇందులో ఏది నిజం? అసలు ఈ రోజే సిబిఐ ఈ మెమో ఎందుకు దాఖలు చేయాల్సి వచ్చిందని, జగన్ బెయిల్‌కు కాంగ్రెస్ పార్టీ అందించిన సహకారానికి ఈ రోజు సిబిఐ ఈ మెమో దాఖలు చేయడమే సాక్ష్యమని ఆయన అన్నారు.

English summary
Telugu Mahila president Shobha Hymavathi said that YS Jagan has got bail with the help of Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X