జగన్ సర్కార్ స్వామిభక్తి- ఏపీ గుళ్లలో స్వరూపానంద పుట్టినరోజు జరపాలని ఆదేశాలు
ఏపీలో విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందకూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఉన్న అవినాభావ సంబంధం తెలిసిందే. జగన్ సీఎం కాకముందు నుంచే విశాఖ పీఠాన్ని పలుమార్లు దర్శించుకోవడం, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా స్వరూపానంద ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవడం జరుగుతూనే ఉన్నాయి. అయితే వీటన్నింటికీ పరాకాష్టగా జగన్ సర్కారు తీసుకున్న మరో నిర్ణయం వివాదాస్పదమవుతోంది.
ఈ నెల 18న స్వరూపానంద పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనట్లుగా ఓ కొత్త ఆదేశాలు జారీ చేసింది. విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద పుట్టినరోజు వేడుకలను ఏపీలోని అన్ని గుళ్లలోనూ అధికారికంగా నిర్వహించాలని దేవాదాయశాఖ తరఫున కమిషనర్ రామచంద్రమోహన్ జారీ చేసిన ఆదేశాలు వివాదాస్పదం అయ్యాయి. శ్రీకాకుళంలోని అరసవిల్లి సూర్యదేవాలయం నుంచి మొదలుపెట్టి ద్వారకాతిరుమల, రామతీర్ధం, సింహాచలం, కనక మహాలక్ష్మి ఆలయం, అన్నవరం, అంతర్వేది, మావుళ్లమ్మ అలయాల ఈవోలకు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.

Recommended Video
వాస్తవానికి స్వరూపానంద పుట్టినరోజు వేడుకలను ఏపీలోని గుళ్లలో అధికారికంగా నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ శారదాపీఠం నుంచి ప్రభుత్వానికి ఈ నెల 9న ఓ లేఖ వచ్చింది. ఈ లేఖను జత చేస్తూ ఆలయాల కార్యనిర్వాహణాధికారులకు దేవాదాయశాఖ ఆదేశాలు ఇవ్వడం వివాదం రేపుతోంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంప్రదాయాలు లేవని, సీఎం మొప్పు కోసం దేవాదాయశాఖ ఇలా చేస్తోందా, లేక ఆయన ఆదేశాల మేరకే చేస్తోందా అన్న చర్చ జరుగుతోంది.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications