వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌ అలా అనడం సరికాదు..! విభజన హామీల గురించి తెలుసుకుని మాట్లాడలన్న ఉండవల్లి..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : ఏపి కి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. 'కేంద్రంలో ఎన్డీయేకు 250 ఎంపీ స్థానాలు దాటకూడదని దేవుడిని కోరుకున్నాను.. కానీ 350కి పైగా వచ్చేశాయి. ఇవాళ కేంద్రానికి మన ఎంపీలు అవసరం లేదు. కమాండింగ్‌ చేయలేను. డిమాండింగ్‌ చేయలేన'ని చెప్పిన జగన్మోహనరెడ్డితో నేను విభేదిస్తున్నాను. మన ఎంపీలు అవసరం లేదనడం సరికాదు.. రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన హామీలను వాళ్లు అమలు చేయాల్సిందే' అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ స్పష్టం చేశారు.

ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన అంశాలను కేంద్రం అమలుచేయాల్సిందేనన్నారు. రాష్ట్ర విభజనపై లోక్‌సభలో చర్చపెట్టాలని సూచించారు. రాష్ట్ర విభజన జరిగింది. ఆ సందర్బంగా ఇచ్చిన హామీలను మాత్రం నాయకులు పట్టించుకోలేదన్నరు ఉండవల్లి. ఇవాళ ఆస్తులన్నీ తెలంగాణలో ఉన్నాయి. పంపిణీ జరగలేదు. తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావుతో సామరస్యంగానే ఉండాలని జగన్ కు సూచించారు. చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగానే వాటిని తెండి. కేసీఆర్‌ తనకొక ఓడరేవు కావాలని కోరుతున్నారు. అక్కడ సముద్రం లేదు. మనకు విశాలమైన సముద్రతీరం ఉంది.

 Jagan is not right .. Do not know about the divide guarantees .. !!

కేసీఆర్‌కు ఇక్కడ ఒక పోర్టు పెట్టుకునే అవకాశమివ్వండి. వాళ్లే అభివృద్ధి చేసుకుని ఉపయోగించుకుంటారు. శ్రీసిటీలా వాన్‌పిక్‌ ప్రాజెక్టు కూడా ప్రయోజనకారే. దానివల్ల గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అనేక ఉద్యోగాలు వస్తాయని వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాకు చెప్పారు. వాన్‌పిక్‌ విషయంలో కేసులు ఉండవచ్చు. మీరు (జగన్‌) ఆ వ్యవహారంలో జైలుకెళ్లినా అక్కడి ప్రజలు మాత్రం వైసీపీకే ఓటు వేశారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఉండవల్లి గుర్తు చేసారు.

English summary
The state was divided. The leaders did not care for the guarantees given on that occasion. All the assets are in Telangana today. Not distributed. Undavally arun kumar suggested Jagan to be in harmony with Telangana CM Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X