జగన్ బెయిల్ రద్దు కాదు-షర్మిల పార్టీకి తనే నిర్మాత, కేసీఆర్ డైరెక్టర్- సీపీఐ నారాయణ షాకింగ్
నిత్యం తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే సీపీఐ జాతీయ నేత నారాయణ ఇవాళ మరోసారి తనదైన శైలిలో రెచ్చిపోయారు. వైఎస్ షర్మిల పార్టీతో పాటు జగన్-కేసీఆర్ పోరు, చివరికి బెయిల్ రద్దుపై జగన్, రఘురామకృష్ణంరాజు పిటిషన్ అన్నీ డ్రామాలేనని నారాయణ వ్యాఖ్యానించారు. మరోవైపు ఉపరాష్ట్రపతి వెంకయ్య ఒక్క మాట చెబితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోతుందన్నారు. ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ కర్నాటక సంగీతం భరించలేకపోతున్నామన్నారు.

షర్మిల పార్టీకి జగన్ నిర్మాత, కేసీఆర్ డైరెక్టర్
తెలంగాణలో వైఎస్సార్టీపీ పేరుతో వైఎస్ షర్మిల ప్రారంభించిన కొత్త పార్టీపై సీపీఐ నారాయణ విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ ఓట్లు చీల్చేందుకు కేసీఆర్ మొదలుపెట్టిన డ్రామాగా దీన్ని అభివర్ణించారు. జగన్ సాయంతో కేసీఆర్ ఈ డ్రామా ఆడిస్తున్నారని నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అనుమతి, కేసీఆర్ ఆహ్వానం లేకూుండా షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేయగలుగుతుందా అని నారాయణ ప్రశ్నించారు. రాజకీయ పగటి నాటకాల్లో ఇదంతా భాగమేనన్నారు. విజయవాడలో పొగొట్టుకున్న సూదిని షర్మిల హైదరాబాద్ లో వెతుక్కుంటోందని నారాయణ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

జగన్-కేసీఆర్ ది గుద్దులాట-ముద్దులాట
ఏపీ-తెలంగాణ ప్రాజెక్టులపై సీఎంలు జగన్, కేసీఆర్ ది నిజమైన కొట్లాట కాదని సీపీఐ నారాయణ వ్యాఖ్యానించారు. వీరిద్దరిదీ గుద్దులాట-ముద్దులాట మాత్రమేనన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల సమస్య కాబట్టి ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకోండని నారాయణ సలహా ఇచ్చారు. లేదా కేంద్రం నుంచి పెద్ద మనిషిని పెట్టుకోమని సూచించారు. మీరిద్దరూ ఎలాగో కేంద్రానికి ఊడిగం చేస్తున్నారుగా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జల జగడం కేంద్రానికీ అవసరమని నారాయణ వ్యాఖ్యానించారు. కేసీఆర్, జగన్ ఇద్దరూ కొట్టుకుని తమ వద్దకు రావాలనే కేంద్రం కోరుకుంటోందన్నారు.

జగన్ బెయిల్ రద్దు కాదు
జగన్ బెయిల్ రద్దు కోరుతూ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ ఓ డ్రామా అని సీపీఐ నారాయణ వ్యాఖ్యానించారు.
జగన్ బెయిల్ రద్దు కోసం అంతా ఎదురుచూస్తున్నారని కానీ, జగన్ కు బెయిల్ రద్దయితే ఏమవుతుందని నారాయణ ప్రశ్నించారు. బెయిల్ రద్దయితే జగన్ కు ఏమైనా భయమా గతంలో ఆయన జైల్లో ఉండి వచ్చిన వాడేగా అన్నారు. బెయిల్ రద్దుతో జగన్ కే లాభమన్నారు. సానుభూతి వస్తుందన్నారు. అయినా అమిత్ షా దయాదాక్షిణ్యాలు ఉన్నంతకాలం జగన్ బెయిల్ రద్దు కాదన్నారు.

జగన్ ను ఏడ్పించేందుకే రఘురామపై వేటు ఆలస్యం
జగన్ బెయిల్ రద్దు కోసం రఘురామ పిటిషన్ వేయడం, రఘురామ అనర్హత కోరుతూ వైసీపీ ఫిర్యాదు చేయడం రెండూ డ్రామాలేనని నారాయణ వెల్లడించారు. వీరిద్దరి నాటకాన్ని అమిత్ షా చూస్తున్నారని నారాయణ తెలిపారు. జగన్ ను ఏడ్పించేందుకే రఘురామ అనర్హత పిటిషన్ ను పెండింగ్ లో పెట్టారని నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో జేడీయూతో విభేదించిన శరద్ యాదవ్ పై వెంకయ్యనాయుడు 24 గంటల్లో అనర్హత వేశారని, ఇప్పుడు లోక్ సభలోనూ రఘురామపై వేటు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. రఘురామకు బీఫారం ఇచ్చింది జగనే, దేశద్రోహం కేసు పెట్టింది జగనేనని నారాయణ గుర్తు చేశారు. రఘురామ దేశద్రోహి అయితే అతనికి బీఫారం ఇచ్చిన జగన్ కూడా దేశద్రోహే అన్నారు.
రఘురామను జగన్ ఎందుకు బహిష్కరించడం లేదని నారాయణ ప్రశ్నించారు. కేంద్రానికి మద్దతిస్తూ రఘురామపై ఎందుకు వేటు వేయించలేకపోతున్నారని జగన్ ను నిలదీశారు. రఘురామదీ తప్పేనని, ఇష్టం లేకపోతే బయటికి పోవచ్చు కానీ ఈ నాటకాలెందుకని ప్రశ్నించారు.
వెంకయ్య చెప్తే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు బ్రేక్
తాజాగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి వంటి రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని ఎలా విమర్శిస్తారని కొందరు ఫోన్ చేసి తనను అడిగారని నారాయణ చెప్పారు. రాజ్యాంగ పదవిలో ఉన్నారు కాబట్టే రాజ్యాంగాన్ని కాపాడమంటున్నామన్నారు.
రాష్టపతి, ఛీఫ్ జస్టిస్ కూడా ఆకాశం నుంచి ఊడిపడలేదని, వెంకయ్యకు ఎలాంటి మినహాయింపూ లేవన్నారు. గతంలో విశాఖ ఉక్కు పై పోరాడిన వెంకయ్య.. ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని నారాయణ ప్రశ్నించారు. వెంకయ్య ఒక్కమాట చెబితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోతుందని, కాకితో కబురు చేసినా ఆగిపోతుందన్నారు. స్టీల్ ప్లాంట్ ను వెంకయ్య కాపాడాల్సిందేనని, కాపాడలేకపోతే ఆయన ఉత్సవ విగ్రహమే అవుతారని నారాయణ వ్యాఖ్యానించారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications