• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్‌కు ప్రశాంత్ కిషోర్ - చంద్రబాబుకు రాబిన్ శర్మ : ఎవరి మ్యాజిక్ ఫలిస్తుంది..?

By Chaitanya
|

నలభై ఏళ్ల రాజకీయ అనుభవం. రాజకీయ వ్యూహాల్లో చాణుక్యుడిగా పేరు. కానీ, ఇప్పుడు జగన్ ను దెబ్బ కొట్టి అధికారంలోకి రావాలంటే తన వ్యూహాలు సరి పోవనే నిర్ధారణకు వచ్చినట్లున్నారు. అదే సమయంలో పదేళ్ల పోరాటంతో..సుదీర్ఘ పాదయాత్రతో అధికారం సొంత చేసుకున్న జగన్. తన కష్టంతో పాటుగా ప్రశాంత్ కిషోర్ సర్వేలు-వ్యూహాలు పని చేయటంతో మరో సారి ఆయన సేవలను వినియోగించుకోవాలనే నిర్ణయం. అయితే, ఏపీలో ముఖ్యమంత్రి..ప్రతిపక్ష నేత ఇప్పుడు ఇద్దరూ ఒకే రాజకీయ వ్యూహకర్తను..ఆయన శిష్యులను తిరిగి అధికారంలోకి రావటానికి నమ్ముకుంటున్నారు.

ఏపీలో ప్రశాంత్ కిషోర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా

ఏపీలో ప్రశాంత్ కిషోర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా

2019 ఎన్నికలకు దాదాపు రెండేళ్ల ముందుగానే ప్రశాంత్ కిశోర్ తో వైసీపీ అగ్రిమెంట్ చేసుకుంది. అప్పటికే ఢిల్లీ, బీహార్, పంజాబ్ లో ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పని చేసిన పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఇక, జగన్ సుదీర్ఘంగా పాదయాత్ర చేసారు. సర్వేలు..అభ్యర్ధుల పైన ప్రజాభిప్రాయం వంటి విషయాలతో పాటుగా కొన్ని వ్యూహాలు..హామీల విషయంలో జగన్ కు ప్రశాంత్ కిషోర్ తోడ్పాటు అందించారు. అయితే, వాస్తవానికి వైసీపీ కంటే ముందుగా టీడీపీనే అప్పట్లో ప్రశాంత్ కిషోర్ సేవలు తీసుకోవాలని భావించినా..అప్పుడు ప్రశాంత్ కిషోర్ అంగీకరించలేదని చెబుతారు.

2019 మ్యాజిక్ మరో సారి పని చేస్తుందా

2019 మ్యాజిక్ మరో సారి పని చేస్తుందా

ఆ తరువాత జగన్ తో కలిసి పని చేసారు. అనూహ్యంగా టీడీపీ సీట్లకు పరిమితం అయింది. జగన్ ఊహించని విధంగా సీట్లతో అధికారంలోకి వచ్చారు. ఆ తరువాత పీకే టీం సేవలు మరి కొంత కాలం కంటిన్యూ అయ్యాయి. జగన్ తన పార్టీ ప్లీనరీలో నేరుగా ప్రశాంత్ కిషోర్ ను పార్టీ నేతల ముందుకు తీసుకొచ్చి పరిచయం చేసి..తాను ఏం చేసినా ఓపెన్ అనే సంకేతాలిచ్చారు. ఇక, ప్రతిపక్షంలో టీడీపీ అప్పటి వరకు ప్రశాంత్ కిషోర్ టీం లో ఉన్న రాబిన్ శర్మ అనే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ తో అగ్రిమెంట్ చేసుకుంది.

జగన్ స్వయంగా వెల్లడించటంతో

జగన్ స్వయంగా వెల్లడించటంతో

ఆయన ప్రశాంత్ కిషోర్ తో కలిసి పని చేసి ఆ తరువాత బయటకు వచ్చి సొంతంగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన టీం సభ్యులు టీడీపీ కోసం పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక, ఇదే సమయంలో వచ్చే ఏడాది నుంచి ప్రశాంత్ కిషోర్ నిర్వహించిన ఐ ప్యాక్ సిబ్బంది వస్తున్నారని..వారు సర్వేలు...పధకాల అమలు వంటి అంశాల పైన సర్వేలు చేస్తారంటూ స్వయంగా సీఎం జగన్ కేబినెట్ లో తన మంత్రులతో ప్రస్తావించారు. దీని ద్వారా తిరిగి ప్రశాంత్ కిషోర్ టీం సభ్యులు తిరిగి వైసీపీ కోసం వచ్చే ఎన్నికల్లో పని చేయనున్నారనేది స్పష్టమైంది.

టీడీపీకి ఆయన టీం సభ్యుడే వ్యూహకర్తగా

టీడీపీకి ఆయన టీం సభ్యుడే వ్యూహకర్తగా

ఇదే సమయంలో రాబిన్ శర్మ టీం ప్రస్తుతం లోకేశ్ వెనుక ఉండి సలహాలు ఇస్తోందని పార్టీ నేతల ద్వారా తెలుస్తోంది. తాజాగా లోకేశ్ పర్యటనలు... ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు వెళ్లి ఓదార్పులు ఇటువంటి కార్యక్రమాలు ఆ వ్యూహకర్తల సూచనలో భాగంగా చెబుతున్నారు. అయితే, ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం కేంద్రంలో మోదీకి వ్యతిరేకంగా ఇతర పార్టీలను ఐక్యం చేసే పనిలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తరువాత తాను ఇక రాజకీయ వ్యూహకర్తగా ఉండనని ప్రకటించారు. కానీ, ఐ ప్యాక్ మాత్రం ఆయన క్రియేట్ చేసిందే.

రెండు పార్టీలకు పీకే టీం సభ్యుల సేవలు

రెండు పార్టీలకు పీకే టీం సభ్యుల సేవలు

అదే విధంగా అందులోని సభ్యులు ఆయన వద్ద శిక్షణ పొందినవారే. ఇప్పుడు జగన్ వద్దకు రానున్న టీం.. ఇప్పటికే టీడీపీ కోసం పని చేస్తున్న టీం ...రెండూ కూడా ప్రశాంత్ కిషోర్ టీంలో భాగస్వాములే. ఇక, తాజాగా తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసిన షర్మిలకు సైతం ప్రశాంత్ కిషోర్ టీంలో పని చేసిన ప్రియా నాయకత్వంలో ఒక టీం సేవలందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక, ఈ మధ్య కాలంలో ప్రశాంత్ కిషోర్ అమరావతితో జగన్ తో భేటీ అయిన తరువాత నేరుగా హైదరాబాద్ కు వెళ్లి కేటీఆర్ సమావేశమైనట్లుగా ప్రచారం సాగింది.

జగన్ ను దెబ్బ తీయాలంటే పీకేనే కరెక్ట్ అంటూ

జగన్ ను దెబ్బ తీయాలంటే పీకేనే కరెక్ట్ అంటూ

టీఆర్ఎస్ సైతం ప్రశాంత్ కిషోర్ సేవలు రానున్న ఎన్నికల్లో వినియోగించుకోవాలని భావిస్తున్నట్లుగా చర్చ సాగింది. కానీ, కేసీఆర్ నిరాకరించటంతో ఆ ప్రతిపాదన ముందుకు కదలలేదు. ఇక, ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశాంత్ కిషోర్ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కూటమిని ఏకం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసినదే ఇప్పుడు ఆయన చేస్తున్నారు. అయితే, మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో మోదీకి వ్యతిరేకంగా వ్యవహరించటానికి టీడీపీ సిద్దంగా లేదు.

జగన్..చంద్రబాబు లో ఎవరికి మేలు జరిగేను

జగన్..చంద్రబాబు లో ఎవరికి మేలు జరిగేను


కానీ, వైసీపీ అధినేత..జగన్ మాత్రం తాము ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ సేవలు తీసుకుంటామని తేల్చి చెప్పేసారు. మరి..అటు వైసీపీ..ఇటు టీడీపీ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ టీం ను..టీంలోని సభ్యులుగా పని చేసిన వారు ఇచ్చే వ్యూహాలను నమ్మకొని ముందుకు సాగనున్నారు. మరి..వీరిద్దరిలో ఎవరికి నిజంగా ప్రశాంత్ కిషోర్ టీం మేలు చేస్తుందీ అనేది హాట్ టాపిక్ గా మారుతోంది. మరి 2019 లో పని చేసిన ప్రశాంత్ కిషోర్ మాయాజాలం ఇప్పుడు మరోసారి ఏపీలో పని చేస్తుందా లేదా అనేది రానున్న రోజుల్లో తేలిపోనుంది.

  AP Economic Advisor గా Former SBI Chief Rajnish Kumar | AP CM Jagan || Oneindia Telugu
  అంతా రహస్యమే...కానీ, వ్యూహాలు మాత్రం వారివే

  అంతా రహస్యమే...కానీ, వ్యూహాలు మాత్రం వారివే

  అయితే, 2019 ఎన్నికల తరహాలో ప్రశాంత్ కిషోర్ స్వయంగా వచ్చి వ్యూహాలు రచించి..పార్టీలకు సేవలిందించే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఆయన తన నిర్ణయంలో మార్పు చేసుకుంటే..ప్రత్యక్షంగా తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే, వీరి పాత్ర అంతా తెర వెనుకే కావటంతో..ఏం జరిగినా రహస్యమే. దీంతో..అధికారంలో ఉన్నా..ముందస్తుగానే రానున్న ఎన్నికల పైన వ్యూహాలు సిద్దం చేస్తున్న జగన్ ఏపీలో రాజకీయంగా ప్రతిపక్షాలకు షాక్ ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నారు.

  English summary
  Since Prashant Kishore team members are working for both Jagan and Chandrababu,it has garnered interest in Political circles as in whose favour the team woulb be working.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X