అమూల్ కోసమే పాలవెల్లువ-జనసేన ఆరోపణలు-త్వరలో అంబులెన్స్ స్కాం బయటపెడతాం..
ఏపీలో జగనన్న పాల వెల్లువ పథకంలో రూ.2887 కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపిస్తున్న జనసేన పార్టీ ఇవాళ తమ దాడిని మరింత తీవ్రతరం చేసింది. జగనన్న పాలవెల్లువ పథకంలో అవినీతి జరిగిందని ఆధారాలతో సహా జనసేన బయటపెడితే... దీనిపై స్పందించాల్సిన మంత్రి వ్యక్తిగత విమర్శలతో సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశార పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఆయన శాఖలో అవినీతే జరగకపోతే పథకంలో లబ్ధిదారుల జాబితాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందాలని, అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా అమలు కావాలని పథకాల్లో జరుగుతున్న అవకతవకలపై జనసేన పార్టీ ప్రశ్నిస్తుంటే... బాధ్యతాయుతంగా సమాధానం చెప్పాల్సిన సంబంధిత మంత్రి మాత్రం వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని నాదెండ్ల విమర్శించారు. వైసీపీ ప్రభుత్వాన్ని మేము అడిగిన ప్రశ్నలు మూడే మూడేనన్నారు. పాడిపశువుల కొనుగోలుపై ఇద్దరు మంత్రులు చెప్పిన సంఖ్యలో తేడాలు ఎందుకు ఉన్నాయి?, మీరు చెప్పినట్లే 3.94 లక్షల పాడిపశువులు కొనుగోలు చేసి ఉంటే పాల ఉత్పత్తి ఎందుకు పెరగలేదు?, అవినీతి జరగకపోతే లబ్ధిదారుల జాబితాను బయటపెట్టడం లేదు? అని నాదెండ్ల నిలదీశారు.

ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పమని సంబంధిత మంత్రిని డిమాండ్ చేస్తే ఆయన... రాష్ట్రంలో ఉన్న డెయిరీల పరిస్థితి గురించీ... చిత్తూరు డెయిరీ, సంఘం డెయిరీలో ఏం జరిగింది? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? వ్యక్తిగత విమర్శలు, రాజకీయ అంశాలు మాట్లాడి సమస్యను పక్కదారి పట్టించాలని చూశారని నాదెండ్ల ఆరోపించారు. చేయూత పథకం మహిళల ఆర్థిక వృద్ధి కోసం పెట్టారా? లేక అమూల్ డెయిరీ కోసం పెట్టారా? అనేది మంత్రిగారు సమాధానం చెప్పాలన్నారు. లబ్ధిదారులు అమూల్ కు సహకరించకపోతే సంక్షేమ పథకం నుంచి తప్పిస్తారా? ఇదెక్కడి న్యాయం? ఇదేం పథకం అని ప్రశ్నించారు.
-
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications