నో చెప్పిందని యువతికి జవాన్ అసభ్యకర ఎస్సెమ్మెస్

ఇతని స్వస్థలం గాజువాక. తమిళనాడులోని వెల్లింగ్టన్‌లో పోస్టింగ్ ఇచ్చారు. సెలవుల పైన ఇంటికి వచ్చిన అతను పెందుర్తికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయాన్ని ఆమెకు చెబితే నిరాకరించింది.
తన ప్రేమ ప్రతిపాదనను అమ్మాయి నిరాకరించినందుకు ఆమెపై కోపం పెంచుకున్నాడు. అప్పటి నుండి యువతికి అస్యకరమైనరీతిలో సంక్షిప్త సందేశాలు పంపించి వేధించడం ప్రారంభించాడు. ఆమెకు ఫోన్ చేసి కూడా వేధించిన సందర్భాలు ఉన్నాయి.
వేధింపులు తట్టుకోలేక యువతి గతేడాది పెందుర్తి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఐఎంఈఐ నంబర్ ఆధారంగా ఫోన్ నెంబర్ ట్రేస్ చేసి వినోద్ కుమార్‌ను గుర్తించారు. అతనిని నిన్న పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications