కేంద్ర పాలిత ప్రాంతంగా తిరుపతి ! పవన్ రాజీనామా ? కేఏ పాల్ కామెంట్స్..!

ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని చెబుతున్న తిరుమల లడ్డూ కల్తీ ఇప్పుడు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ వివాదంపై ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు పార్టీలకు అతీతంగా స్పందిస్తున్నారు. అదే సమయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇవాళ చేసిన మతపరమైన వ్యాఖ్యలపై పాల్ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన రాజీనామాకు డిమాండ్ చేశారు.

లడ్డూ గురించి ముందే తెలిసినప్పుడు 100 రోజుల సందర్భంలో ఎందుకు చెప్పారని సీఎం చంద్రబాబును కేఏ పాల్ ప్రశ్నించారు. పవన్ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడని, అసలు సనాతనధర్మం గురించి పవన్ కి ఏం తెలుసని పాల్ అడిగారు. హిందు ముస్లిం, క్రిస్టియన్ మధ్య గొడవలు ఎందుకు పెడతావని పవన్ ను ఆయన ప్రశ్నించారు. పవన్ 15నిమిషాల ప్రెస్ మీట్ విని అలసి పోయానన్నారు. పవన్ తక్షణం ఉప ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలన్నారు.

ka paul demands to make Tirupati as union territory amid laddu row seek pawan kalyan resignation

తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని పాల్ డిమాండ్ చేశారు. సీక్రెట్ గా స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్ముతున్నారని కేంద్రాన్ని కూడా ప్రశ్నించారు. లడ్డుకోసం కాదు స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష చేయాలని పవన్ కు పాల్ సూచించారు. 30వేల అమ్మాయిలు మిస్ అయ్యారని కామెంట్ చేసిన పవన్.. అధికారం లోకి వచ్చిన తరువాత ఎందుకు మాట్లాడం లేదన్నారు. మిస్ అయిన అమ్మాయిల విషయం పై మాట్లాడకపోతే నోరు మూసుకొని వుండాలంటూ సలహా ఇచ్చారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్లనే లడ్డు కాంట్రావర్సీ అన్నారు.

స్టీల్ ప్లంట్ అమ్మకం కోసమేనా లడ్డు వివాదం అని పాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లడ్డులో కల్తీ కలిసింది అంటే తక్షణమే విచారణ జరిపించాలన్నారు. విశాఖ లో పారిశ్రామిక ప్రమాదంలో 36 మంది చనిపోతే పవన్ ఎక్కడని ఆయన అడిగారు.
వరదల్లో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పవన్ ఎక్కడ అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పవన్ ని వాడుకొంటుందని,
వైసీపీ లో ఉండే యూజ్ లెస్ ఫెలోస్ జనసేనలో చేరుతున్నారని పాల్ తెలిపారు. 100 రోజుల పవన్ కి 0 మార్కులు ఇస్తానన్నారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా పనికిరాడని, సినిమాకి సెట్ అవుతాడన్నారు.

పవన్ సనాతన ధర్మం కోసం చనిపోతే నేను ప్రజలకోసం చనిపోతా అని పాల్ తెలిపారు. పవన్ స్క్రిప్ట్ ఇస్తే దాన్నే చదువుతాడని, బుర్ర వాడడని పాల్ ఎద్దేవా చేసారు. జగన్ నాతో రా, ప్రత్యేక హోదా కోసం, స్టీల్ ప్లంట్ కోసం పోరాటం చేద్దామని పాల్ ప్రతిపాదించారు. ప్యాకేజ్ స్టార్ లు చాలా మాట్లాడతారని, చంద్రబాబు పెద్ద ప్యాకేజ్ స్టార్ అని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+