కాకినాడలో ప్రేమోన్మాది ఘాతుకం-ప్రేమించలేదని వేటకొడవలితో నరికి హత్య..

కాకినాడలో ఇవాళ దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో ఓ యువతిని కొంతకాలంగా వేధిస్తున్న ప్రేమోన్మాది ఎట్టకేలకు ఇవాళ ఆమె స్కూటీపై వెళ్తుండగా హతమార్చాడు. వేటకొడవలితో నరికి మరీ చంపాడు. దీంతో ఈ ఘటన కాకినాడ జిల్లాల్లో తీవ్ర కలకలం రేపింది.

కాకినాడ జిల్లాలోని కాండ్రేగుల కూరాడ గ్రామంలో దేవకి అనే యువతిని సూర్యనారాయణ అనే యువకుడు కొంతకాలంగా వేధిస్తున్నాడు. తనను ప్రేమించాలని వెంటపడుతున్నాడు. దీనికి ఆమె నిరాకరించింది. అయినా ఆమెను వదిలిపెట్టలేదు. ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు. ప్రేమించమని ప్రాధేయపడుతున్నాడు. కానీ ఆమె అంగీకరించలేదు. ఆమె కుటుంబసభ్యులు కూడా అడ్డుచెప్పారు. అయినా ప్రేమోన్మాది సత్యనారాయణ వదిలిపెట్టలేదు. చివరికి ఆమెను ఎలాగైనా అంతమొందించాలని ప్లాన్ చేశాడు.

kakinada girl brutally killed with knife by lover for not loving

తనకు దక్కని దేవకి మరెవరికీ దక్కకూడదని భావించిన సూర్యనారాయణ ఇవాళ ఆమె గ్రామంలో స్కూటీపై వెళ్తుండగా అకస్మాత్తుగా వేటకొడవలితో దాడి చేశాడు. ఆమె మెడభాగంగా నరికేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన దేవకిని గ్రామస్తులు ఆస్పత్రికి తరలించి కాపాడే ప్రయత్నం చేసినా బతకలేదు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటనా స్ధలికి చేరుకుని ప్రేమోన్మాదిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు ముందు ఏం జరిగిందనే దానిపై విచారణ ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+