వైసీపీ ఎమ్మెల్యేలకు కోడెల ఫోన్: కోర్టు తీర్పు తర్వాతే నిర్ణయం

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తాను నిర్ణయం తీసుకోకముందే వైసీపీ నేతలు కోర్టులను ఆశ్రయించారని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. కోర్టు తీర్పు వెలువడకముందే తాను ఎలా నిర్ణయం తీసుకోగలనని కోడెల శివప్రసాదరావు చెప్పారు.

వైసీపీ నుండి ఇటీవలే రంపచోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరీ టిడిపిలో చేరారు. ఆమెపై చర్య తీసుకోవాలని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు వైసీపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు.

బాబును అంతం చేసే కుట్ర, నాపై జగన్‌తో సహ ఎవరైనా పోటీ చేయండి: ఆది సంచలనం

ఏపీ రాష్ట్రంలో సుమారు 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుండి టిడిపిలో చేరారు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఇదివరకే వైసీపీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. అంతే కాదు కోర్టులను కూడ ఆశ్రయించింది.

 కోర్టు తీర్పు ఇవ్వకుండా నిర్ణయం ఎలా తీసుకోవాలి?

కోర్టు తీర్పు ఇవ్వకుండా నిర్ణయం ఎలా తీసుకోవాలి?

వైసీపీ నుండి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్‌కు ఆ పార్టీ శాసన.సభపక్షం గతంలోనే ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదుపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ లోపుగానే వైసీపీ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో వైసీపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కారణాలన్నింటిని దృష్టిలో ఉంచుకొని పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోనే విషయమై నిర్ణయం వెలువరించే అవకాశం లేకుండాపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు వెలువరించకుండా ఈ విషయమై తాను ఎలా నిర్ణయం తీసుకొంటానని స్పీకర్ కోడెల శిపప్రసాదరావు ప్రకటించారు.

 అసెంబ్లీ సమావేశాలు బహిష్కరంచడం బాధాకరం

అసెంబ్లీ సమావేశాలు బహిష్కరంచడం బాధాకరం

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోలేదనే కారణాలను చూపుతూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం సరికాదన్నారు. ఈ విషయమై పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తాను ఓ విధానాన్ని తీసుకోవాల్సిన తరుణంలో కోర్టులను ఆశ్రయించడంతోనే కోర్టు తీర్పు కోసం వేచి చూడాల్సి వస్తోందన్నారు. ఈ కారణాన్ని సాకుగా చూపి అసెంబ్లీ సమావేశాలను వైసీపీ ఎమ్మెల్యేలు బహిష్కరించడం సరైందికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

అసెంబ్లీ సమావేశాలకు హజరుకావాలని కోరా

అసెంబ్లీ సమావేశాలకు హజరుకావాలని కోరా

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని వైసీపీ శాసనసభపక్షం నిర్ణయం తీసుకొన్న మీదట వారితో ఈ విషయమై ఫోన్‌లో చర్చించానని స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలకు హజరుకావాలని వైసీపీ నేతలను కోరినట్టు ఆయన చెప్పారు.

ఎన్టీఆర్ ఒక్కరే అసెంబ్లీకి హజరుకాలేదు

ఎన్టీఆర్ ఒక్కరే అసెంబ్లీకి హజరుకాలేదు

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఆనాడు చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీకి హజరుకాబోనని ప్రకటించిన ఎన్టీఆర్. అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని కోడెల శివప్రసాదరావు గుర్తు చేశారు. అయితే అదే సమయంలో టిడిపి ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ సమావేశాలకు హజరైన విషయాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు గుర్తు చేశారు. అసెంబ్లీలో చివరిరోజు వరకు కూడ టిడిపి ఎమ్మెల్యేలు తమ వాదనను వినిపించారని ఆయన చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The monsoon and winter session of the Assembly is likely to be held for 10 to 15 days. The number of working days would be decided after receiving clarity from the State government, said Assembly Speaker Kodela Sivaprasada Rao on Wednesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి