kondapalli election : కొండపల్లి రాజా ఎవరో ? కాసేపట్లో ఛైర్మన్ ఎన్నిక-భారీ పోలీసు భద్రతతో

కృష్ణాజిల్లా కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక కాసేపట్లో జరగబోతోంది. రెండురోజులుగా వాయిదా పడుతూ వస్తున్న కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను వైసీపీ, టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో తుదికంటా ఉత్కంఠ రేపుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఎన్నికకు గట్టి పోలీసు భద్రత కల్పిస్తున్నారు.

రెండు రోజులుగా వరుసగా ఎన్నికను వాయిదా వేస్తూవస్తున్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇవాళ హైకోర్టు ఆధేశాలతో తప్పనిసరిగా ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్ధితి వచ్చింది. దీంతో పోలీసు భద్రత మధ్య ఎన్నిక నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలతో ఇప్పటికే దాదాపు 800 మంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో రెండురోజులుగా గందరగోళం సృష్టిస్తున్న వైసీపీ కౌన్సిలర్లు ఇవాళ ఏం చేస్తారో చూడాల్సి ఉంది.

kondapalli municipal chairman election today with full police protection

తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ ఇద్దరూ 14 సీట్ల చొప్పున గెల్చుకున్నాయి. మరో సీటు గెల్చుకున్న ఇండిపెండెంట్ టీడీపికి మద్దతు తెలిపారు. ఇది కాక టీడీపీ ఎంపీ కోఆప్షన్ సభ్యుడిగా ఓటు వేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అటు స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా కో ఆప్షన్ సభ్యుడిగా ఓటు వేయనున్నారు.

అదే సమయంలో వైసీపీ మాత్రం కేశినేని నాని ఓటును వ్యతిరేకిస్తోంది. ఇదే కారణంతో రెండు రోజులుగా ఎన్నికను అడ్డుకుంటోంది. ఎన్నిక యథాతథంగా జరిగితే మాత్రం మొత్తం 16 సభ్యుల బలం కలిగిన టీడీపీ, 15 మంది సభ్యుల బలం కలిగిన వైసీపీపై ఒక్క ఓటు ఆధిక్యంతో కొండపల్లి ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోనుంది. అలాగే వైస్ చైర్మన్ పదవిని కూడా దక్కించుకోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+