వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మత్తయ్యకు బెదిరింపులు: కెటిఆర్ డ్రైవర్‌, గన్‌మన్లకు అరెస్టు వారంట్లు?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందితుడైన మత్తయ్యను బెదిరించారనే ఆరోపణలపై నోటీసులు జారీ చేసినప్పటికీ విచారణకు హాజరు కాకపోవడంతో తదుపరి చర్యలకు ఆంధ్రప్రదేశ్ సిఐడి సన్నద్ధమవుతోంది. నోటీసులు జారీ చేసినప్పటికీ తెలంగాణ మంత్రి కేటీఆర్‌ గన్‌మెన్‌, కారు డ్రైవర్‌ విచారణకు హాజరు కాలేదు.

వారిరువురి కోసం ఎపి సీఐడీ పోలీసులు సోమవారం తమ కార్యాలయంలో ఎదురు చూశారు. కేటీఆర్‌ గన్‌మన్‌ జానకిరామ్‌, డ్రైవర్‌ సత్యనారాయణల ఫోన్ల నుంచి మత్తయ్యకు కాల్స్‌ వచ్చినట్లు సీఐడీ పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో, విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చేందుకు బుధవారం విశ్వప్రయత్నం చేశారు.

KTR' driver and gunman may face arrest warrant

తొలుత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు క్యాంప్‌ ఆఫీసుకు, తర్వాత నంది నగర్‌లోని నివాసానికి, తర్వాత ఐఎ్‌సడబ్ల్యూ కార్యాలయానికి వెళ్లినా ఫలితం లభించలేదు. శుక్రవారం తెలంగాణ ఐఎస్‌డబ్ల్యూ చీఫ్‌ మహేశ్‌ భగవత్‌ వద్దకెళ్లి నోటీసులు అందించి, రశీదులు తీసుకున్నారు.

ఈ నోటీసుల మేరకు జానకిరాం, సత్యనారాయణ సోమవారంలోపు విచారణకు హాజరు కావాల్సి ఉంది. వారు నోటీసులను బేఖాతరు చేయడంతో విజయవాడ కోర్టుద్వారా అరెస్టు వారెంటు పొందాలని ఏపీ సీఐడీ అధికారులు భావిస్తున్నారు.

English summary
It is said that Andhra Pradesh CID may get orders from court arrest Telangana minister KT Rama Rao's gunman and driver.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X