గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖలో బిట్స్: బిర్లా ఆపర్, బాబు హ్యాపీ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బిట్స్ పిలానీకి అనుబంధ విద్యాసంస్థను విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి ఆదిత్య బిర్లా గ్రూప్ అధిపతి కుమార మంగళం బిర్లా ముందుకు వచ్చారు. అక్కడే బిర్లా అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆయన గురువారం నాడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును సచివాలయంలో కలిశారు. విశాఖలో బిట్స్, అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటు చేస్తే భూములు ఇచ్చేందుకు సిద్ధమని బాబు తెలిపారు.

అదే సమయంలో గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం మాదినపాడు దగ్గర అల్ట్రా టెక్ సిమెంట్ కర్మాగారం ఏర్పాటు చేయబోతోంది. దీనికి ఇదివరకే 1866 ఎకరాల విస్తీర్ణంలో సున్నపురాయి గనుల ప్రాస్పెక్టింగ్ లైసెన్సులు జారీ చేశారు. వాటికి సంబంధించిన నో ఆబ్జెక్షన్ పత్రాన్ని వెంటనే ఇప్పించాలని చంద్రబాబు తన ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. పరిశ్రమల శాఖ వద్ద పెండింగులో ఉన్న మరో ప్రాస్పెక్టింగ్ లైసెన్సు దరఖాస్తును వారం లోపు క్లియర్ చేయాలని చెప్పారు.

ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రారంభించి సగంలో వదిలేయడం జాతి ప్రయోజనాలకు ఏమాత్రం మంచిది కాదని, దేశంలోనే ప్రప్రథమంగా ఈ-గవర్నెన్స్‌ను చేపట్టిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలుస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్నో మంచి కార్యక్రమాలను గత పదేళ్లలో ప్రభుత్వాలు మధ్యలోనే నిలిపివేసిన విషయాన్ని గుర్తు చేశారు.

చంద్రబాబుతో కుమార మంగళం బిర్లా

చంద్రబాబుతో కుమార మంగళం బిర్లా

విశాఖపట్నంలో బిర్లా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌) సంస్థను ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా హామీ ఇచ్చారు.

చంద్రబాబుతో కుమార మంగళం బిర్లా

చంద్రబాబుతో కుమార మంగళం బిర్లా

బిట్స్‌ పిలానీకి అనుబంధంగా నవ్యాంధ్రలోనూ కాలేజీని ఏర్పాటు చేయాలన్న చంద్రబాబు సూచనకు సానుకూలంగా స్పందించారు. దీనితోపాటు, బిర్లా ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఏర్పాటుకు కూడా విశాఖలో భూమి ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

చంద్రబాబుతో కుమార మంగళం బిర్లా

చంద్రబాబుతో కుమార మంగళం బిర్లా

ఆదిత్య బిర్లా గ్రూపునకే చెందిన అలా్ట్రటెక్‌ కర్మాగారాన్ని గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం మాదినపాడు వద్ద ఏర్పాటు చేసేందుకు 1866 ఎకరాల విస్తీర్ణంలో సున్నపురాయి గనుల ప్రాస్పెక్టింగ్‌ లైసెన్సునకు సంబంధించిన నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) వెంటనే ఇప్పించాలని ముఖ్య కార్యదర్శి సతీశ్‌ చందర్‌కు చంద్రబాబు సూచించారు.

చంద్రబాబు

చంద్రబాబు

ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రారంభించి సగంలో వదిలేయడం జాతి ప్రయోజనాలకు ఏమాత్రం మంచిది కాదని, దేశంలోనే ప్రప్రథమంగా ఈ-గవర్నెన్స్‌ను చేపట్టిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలుస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్నో మంచి కార్యక్రమాలను గత పదేళ్లలో ప్రభుత్వాలు మధ్యలోనే నిలిపివేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటి చర్యలతో మానవ వనరులు, ప్రజాధనం రెండూ వృథా అవుతాయని స్పష్టం చేశారు.

చంద్రబాబు

చంద్రబాబు

గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన ఈ-గవర్నెన్స్‌ ప్రాజెక్టును మధ్యలోనే ఆపేశారని, ఆ పథకానికి బూజు పట్టించారని చంద్రబాబు అన్నారు. మళ్లీ ఇప్పుడు ఆ బూజు దులిపి పథకానికి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చే ప్రక్రియను ప్రారంభించామని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎంటర్‌ప్రైజరీ ఆర్కిటెక్చర్‌ (ఏపీఎస్‌ఈఏ) ప్రాజెక్టుపై చర్చించేందుకు సచివాలయంలో గురువారం విప్రో ప్రతినిధులు ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు వారు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

 చంద్రబాబు

చంద్రబాబు

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. మళ్లీ అధికారంలోకి రాగానే తమ ప్రభుత్వం టెక్నాలజీపై దృష్టి పెట్టిందని, అన్ని ప్రభుత్వ ప్రయోజనాలు, పథకాలను ఆధార్‌తో అనుసంధానం చేసిన తొలి రాష్ట్రంగా పేరు తెచ్చుకున్నామని వివరించారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుని ఏపీని దేశంలోనే తొలి స్మార్ట్‌ రాష్ట్రంగా మార్చాలన్నదే తమ తాపత్రయమని చెప్పారు.

 చంద్రబాబు

చంద్రబాబు

దశాబ్దం కిందటే తాము ఈ-సేవను ప్రారంభించామని, ఇప్పుడు ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ సహా అనేక ప్రభుత్వ, ప్రైవేటు సేవలను మీ-సేవ కేంద్రాల ద్వారా అందిస్తున్నామని తెలిపారు. ఈ-గవర్నెన్స్‌ ప్రాజెక్టు అమల్లోనూ పట్టుదలతో ఉన్నామన్న చంద్రబాబు.. ప్రభుత్వంలోని అన్ని విభాగాలనూ ఈ-ఆఫీసులుగా మారుస్తామని, తొలి ఈ-గవర్నెన్స్‌ రాష్ట్రంగా పేరు తెచ్చుకోవడమే ధ్యేయమని చంద్రబాబు వివరించారు.

English summary
Kumar Mangalam Birla called on Sri N. Chandrababu Naidu Hon'ble Chief Minister of Andhra Pradesh at Secretariat
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X