ఏపీలో కార్మిక, ప్రజా సంఘాల ‘జైల్ భరో’ ఉద్రిక్తం: అరెస్టులు!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆందోళనలు ఉధృత రూపం దాల్చాయి. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మినుముడుతున్నాయి. అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులకు మద్దతుగా నేడు అన్ని కార్మిక సంఘాలు జైల్ భరోకు పిలుపునిచ్చాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమ్మెలు, ఆందోళనలు కొనసాగుతున్నా ఏ విధమైన స్పందన లేకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని రాష్ట్రంలోని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు కార్మిక సంఘాలు అన్ని జిల్లా కేంద్రాలలో ఆందోళనలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రైతు వ్యవసాయ కార్మిక రైతు కూలీ సంఘాలు తీవ్ర నిరసనను వ్యక్తం చేశాయి.

Labor unions and people unions Jail Bharo created tension in AP: police forcibly Arrested!!

ఎక్కడికి అక్కడ ఆందోళనలు నిర్వహించాయి. దీంతో పోలీసులు ఎక్కడికి అక్కడ ఆందోళనకారులను అదుపు చేయడానికి రంగంలోకి దిగిన పోలీసులు బలవంతపు అరెస్టులు చేశారు. విజయవాడలో చేపట్టిన జైలు భరో ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఆందోళన నిర్వహిస్తున్న కార్మిక సంఘాలు, ప్రజాసంఘాల నేతలను బలవంతంగా అరెస్ట్ చేశారు.

అద్దంకిలో మున్సిపల్, అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాకినాడలో కలెక్టరేట్లోకి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం పైన కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. వైయస్ జగన్ ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ రహదారిపై నినాదాలు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో కూడా ఆందోళన కారుల అరెస్టులు కొనసాగాయి.

మరోవైపు పల్నాడు జిల్లా నరసరావుపేటలో అఖిలపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు రైతు సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ సమస్యలను మరియు మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని రాస్తారోకో నిర్వహించారు. అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విశాఖ ఎల్ఐసి అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి జైలు భరో కార్యక్రమానికి బయలుదేరిన అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల అరెస్టుల పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసిపి నిరంకుశ పాలనకు ఇది నిదర్శనమని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+