లియో తొలిరోజు కలెక్షన్ల సునామీ: థియేటర్లో విజయ్ ఫ్యాన్ ఎంగేజ్మెంట్ కహానీ!!
దళపతి విజయ్ కథానాయకుడిగా, కథానాయకిగా త్రిష నటించిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన లియా సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ సినిమా కలెక్షన్లు మాత్రం అదిరిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే 115 కోట్ల రూపాయలను వసూలు చేసిన ఈ సినిమా రికార్డు సృష్టించింది.
గతంలో రజనీకాంత్ నటించిన కబాలి 105 కోట్లను, రోబో 2.0 117 కోట్లను వసూలు చేసిన తర్వాత తొలి రోజు 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన కోలీవుడ్ సినిమాగా లియో సినిమా నిలిచింది. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విజయ్ ఫ్యాన్స్ కు పండుగ వాతావరణం తీసుకువచ్చింది.

దసరాకు ముందు రిలీజ్ అయిన ఈ సినిమాతో అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. థియేటర్ల ముందు పెద్ద పెద్ద విజయ్ కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేశారు. కేకులు కట్ చేశారు. స్వీట్లు పంచిపెట్టారు. బాణసంచా కాల్చారు. అంతేకాదు డాన్సులు చేస్తూ హంగామా చేశారు. ఒక కోవై లోనే లియో చిత్రం 100 థియేటర్లలో రిలీజ్ కాగా, విజయ్ ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
ఇక లియో సినిమా విడుదల రోజునే ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. పుదుకోటైకి చెందిన వెంకటేష్ అనే విజయ్ అభిమాని లియో సినిమా ఆడుతున్న థియేటర్లోనే తను ప్రేమిస్తున్న మంజుల అనే అమ్మాయితో నిశ్చితార్ధం చేసుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన అతను తనకు తల్లి తండ్రి ఎవరూ లేరని తనకు విజయ్ నే అన్నీ అని పేర్కొన్నారు.
విజయ్ సినిమా రిలీజ్ రోజుకు మించిన మంచి రోజు లేదని అతను పేర్కొన్నారు. అందుకే ఈరోజు తన వివాహ నిశ్చితార్థం జరుపుకున్నట్లు సదరు అభిమాని వెల్లడించారు. ఇదిలా ఉంటే విడాముయర్చి చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్న త్రిష కూడా , అజిత్ తో జరుగుతున్న షూటింగుకు డుమ్మా కొట్టి మరీ లియో సినిమా చూడడానికి వెళ్లారు. ఇక చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్, అనిరుద్ కూడా ప్రేక్షకుల మధ్యలో లియో సినిమాను చూశారు.












Click it and Unblock the Notifications