Pawan Kalyan: పవన్ ను లేపేస్తాం-వరుస బెదిరింపు కాల్స్, మెసేజ్ లు..!

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాలయ సిబ్బందికి ఆగంతకుడి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. చంపేస్తామని హెచ్చరించిన ఆగంతకుడు. ఆ క్రమంలో అభ్యంతకర భాషతో హెచ్చరిస్తూ మెసేజులు పంపించాడు. పేషీ సిబ్బంది బెదిరింపు కాల్స్, మెసేజులను ఉప ముఖమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లారు. పేషీ అధికార్లు బెదిరింపు కాల్స్, మెసేజుల విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు తెలిపారు.

life threatening calls and messages to ap deputy cm pawan kalyan s peshi

ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీ ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ లేని సమయంలో పేషీకి ఆయన్ను చంపేస్తామంటూ ఆగంతకుల నుంచి బెదిరింపు కాల్స్ తో పాటు మెసేజ్ లు కూడా వచ్చాయి. ఇందులో పవన్ ను అసభ్య భాషలో జారీ చేసిన హెచ్చరికలు కూడా ఉన్నాయి. దీంతో పేషీ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సూచన మేరకు పేషీ సిబ్బంది పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లారు.

వెంటనే స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు.. పవన్ కళ్యాణ్ పేషీకి ఎక్కడ నుంచి ఈ బెదిరింపు కాల్స్, మెసేజ్ లు వచ్చాయో ఆరా తీస్తున్నారు. పవన్ తో పాటు మరే ఇతర మంత్రి పేషీకి అయినా ఇలా కాల్స్ వచ్చాయోమోనని పరిశీలిస్తున్నారు. పవన్ పేషీకి ఏ సమయంలో ఈ కాల్స్, మెసేజ్ లు వచ్చాయో వివరాలు తీసుకుని దర్యాప్తు చేయబోతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇలా పవన్ కు బెదిరింపు కాల్స్ రావడంతో ఈ వ్యవహారం ప్రభుత్వంలో చర్చనీయాంశమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+