AP Schemes: పథకాలకు ఈసీ బ్రేక్ పై హైకోర్టుకు లబ్దిదారులు - లంచ్ మోషన్ విచారణ..!
ఏపీలో వైసీపీ సర్కార్ సంక్షేమ పథకాల లబ్దిదారులకు ఎన్నికల వేళ భారీ షాక్ తగిలింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పథకాలకు డబ్బులు విడుదల చేయకుండా ఈసీ నిన్న ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో చేయూత, విద్యాదీవెన, రైతు భరోసా వంటి పథకాలకు నిధులు విడుదల కాకుండా పోయాయి. దీంతో లబ్దిదారులు లబోదిబోమంటున్నారు. దీనిపై వైసీపీ వర్సెస్ విపక్షాల వార్ మొదలైంది.
ఈ క్రమంలోనే మహిళా సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. రాష్ట్రంలో ఇప్పటికే కొనసాగుతున్న సంక్షేమ పథకాలకు ఎన్నికల కోడ్ పేరుతో నిధులు విడుదల చేయకుండా అడ్డుకోవడం సరికాదంటూ హైకోర్టులో మహిళా సంఘాలు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాయి. ఈ మేరకు ఈసీ ఇచ్చిన ఆదేశాలపై అత్యవసర విచారణ జరపాలని హైకోర్టును కోరాయి. దీంతో ఈ పిటిషన్ పై మధ్యాహ్నం విచారణ జరిపేందుకు హైకోర్టు అంగీకరించింది.

ఎన్నికలకు ముందే సీఎం జగన్ బటన్ నొక్కేసిన ఈ పథకాల డబ్బులు ఇప్పటివరకూ లబ్దిదారుల ఖాతాల్లో పడలేదు. ఈ నిదుల విడుదలకు అనుమతి ఇవ్వాలని వైసీపీ సర్కార్ ఈసీని ఆశ్రయించింది. అయితే ఈసీ మాత్రం ఎన్నికలు ముగిసేవరకూ పథకాల నిధుల విడుదలకు అనుమతి ఇవ్వలేమని తెలిపింది. ఎన్నికలు ముగిశాక నిధులు విడుదల చేసుకోవచ్చని క్లారిటీ ఇచ్చింది. దీంతో ఆయా పథకాలు అందుకుంటున్న లబ్దిదారులకు షాక్ తగిలింది.
మరోవైపు దీనిపై రాజకీయ రచ్చ కూడా మొదలైంది. పథకాలను విపక్షాలు ఈసీ సాయంతో అడ్డుకుంటున్నాయని వైసీపీ ఆరోపిస్తుండగా.. విపక్షాలు మాత్రం జగన్ ఉద్దేశపూర్వకంగానే బటన్ నొక్కి ఇప్పటికీ నిధులు విడుదల చేయలేదని కౌంటర్లు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇవాళ తీసుకోబోయే నిర్ణయం కీలకంగా మారింది.
-
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి!











Click it and Unblock the Notifications