దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో మాధురి భర్త ఎంట్రీ.. చెప్పింది వింటే చచ్చిపోతారు!

దువ్వాడ కుటుంబ కథా చిత్రంలో మాధురి భర్త ఎంట్రీ ఇచ్చారు .గత వారం రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఫైట్ ఎపిసోడ్లో జరిగిందంతా చూసిన తర్వాత కూడా మాధురి భర్త మహేష్ నా భార్య పైన పూర్తి నమ్మకం ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మాధురి భర్త షాకింగ్ వ్యాఖ్యలు
రాజకీయంగా ఎదుగుతుందన్న కారణంతో తన భార్యను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాధురి భర్త దివ్వెల మహేష్ చంద్రబోస్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తాను టిడిపిని ఇష్టపడతానని, మాధురి వైసిపిని ఇష్టపడుతుందని, రాజకీయాలపై ఆసక్తి ఉందన్న కారణంతో తనకు ఇష్టం లేకపోయినా మాధురి వైసీపీలోకి వెళ్లడానికి మద్దతు ఇచ్చానని తెలిపారు.

Madhuri husband entry in the Duvvada family drama shocking comments

మాధురిని అనుమానించటానికి రాముడిని కాదు
మాధురి గురించి ఎవరేం చెప్పినా తాను నమ్మేది లేదని, తన భార్య మాధురిని అనుమానించటానికి తాను శ్రీరాముడిని కాదంటూ ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తాను చాలా బాగా డాన్స్ చేస్తుందని, తన డాన్సులు కూడా ట్రోల్ చేస్తున్నారని పేర్కొన్నారు. మాధురి దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో ఎందుకు ఉంటుంది అని యాంకర్ అడిగిన ప్రశ్నకు నో కామెంట్స్ అంటూ సమాధానం ఇచ్చారు.

డబ్బు కోసం ట్రాప్ చెయ్యాల్సిన అవసరం మాధురికి లేదు
తాను యుఎస్ లో మెరైన్ ఇంజనీర్ గా పనిచేస్తున్నానని, నెలకు 10 లక్షల రూపాయల జీతం వస్తుందని తాను ప్రతినెలా మాధురికి డబ్బులు పంపిస్తున్నానని, తనకు డబ్బు కోసం ఎవరిని ట్రాప్ చేయాల్సిన అవసరం లేదని మహేష్ చంద్రబోస్ తెలిపారు. ఇదిలా ఉంటే ఇంతకుముందు తన భర్త గురించి మాధురి మాట్లాడిన సమయంలో దువ్వాడ వాణి చేస్తున్న ప్రచారానికి తన భర్త తనను రెండేళ్లుగా వదిలేశాడని అన్నారు.

భర్త వదిలేశాడన్న మాధురికి మద్దతుగా భర్త ,. షాకింగ్ ట్విస్ట్
భర్త వదిలేసిన ఇటువంటి సమయంలో తాను ఎవరితో ఉండాలో చెప్పాలి అంటూ ప్రశ్నిస్తూ అందుకే తాను దువ్వాడ శ్రీనివాస్ తో ఉంటున్నట్లుగా మాధురి వ్యాఖ్యలు చేశారు. మరి తనను భర్త వదిలేసాడని చెప్పిన మాధురి భర్త ఇప్పుడు తన భార్య చాలా మంచిదని, కాకుంటే అందరితో ఫ్రీగా మాట్లాడుతుందని, ఎవరేం చెప్పినా తనను అనుమానించేది లేదని చెప్పడం నిజంగా అందరూ షాక్ అయ్యే విషయమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+