Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ పై ఆగని కాంగ్రెస్ కౌంటర్ అటాక్..! తెరపైకి విజయమ్మను లాగి..!

జాతీయ స్ధాయిలో రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ల చోరీ పోరాటానికి మద్దతు పలుకుతారా అన్న మీడియా ప్రశ్నకు స్పందిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన హాట్ లైన్ టచ్ విమర్శలు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ప్రకంపనలు రేపుతూనే ఉన్నాయి. చంద్రబాబు, రేవంత్ రెడ్డితో రాహుల్ హాట్ లైన్ లో టచ్ లో ఉన్నారని, అందుకే ఏపీలో ఓట్ల అక్రమాలపై స్పందించలేదంటూ జగన్ చేసిన విమర్శలకు కాంగ్రెస్ ఇప్పటికే కౌంటర్ ఇచ్చింది. తాజాగా మరోసారి కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ జగన్ కు కౌంటర్ ఇచ్చారు.

వైసీపీకి చెందిన తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి .. మాణిక్కం ఠాకూర్ .. జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోడీ పాదాలను తాకుతున్న ఫోటోను పోస్ట్ చేయడం ద్వారా మీరు ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. జగన్ గతంలో అప్పటి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ , మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పాదాలను కూడా తాకారని గుర్తుచేశారు. ఇది రాజకీయాల గురించి కాదని, మర్యాదలు , అతని తల్లిదండ్రులు అతనిలో పెంపొందించిన విలువల గురించి అన్నారు.

Manickam Tagore s Tweet Escalates Congress s Counter to YS Jagan s Hotline Allegation

జగన్ స్థానం లేదా పార్టీతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ పెద్దలకు గౌరవం చూపించాలని గురుమూర్తి తెలిపారు. ఇటువంటి హావభావాలు వినయం , మంచి పెంపకాన్ని ప్రతిబింబిస్తాయన్నారు. ఇది రాజకీయ సమర్పణ లేదా బలహీనత కాదన్నారు. ఇది కేవలం పెద్దలను గౌరవించే ఆయన మార్గమన్నారు. ఆయన తన ప్రజా జీవితమంతా స్థిరంగా అనుసరించిన ఆచారమన్నారు. ఈ ట్వీట్ కు మాణిక్కం ఠాకూర్ కౌంటర్ ఇచ్చారు.

Manickam Tagore s Tweet Escalates Congress s Counter to YS Jagan s Hotline Allegation

ఎంపీ గురుమూర్తి గారూ..మీకు నేను ఓ సింపుల్ ప్రశ్న వేస్తున్నా.. మోడీకి పాదాభివందనం చేసిన ఏకైక ఏపీ సీఎం ఎవరని మాణిక్కం ఠాకూర్ ప్రశ్నించారు. మోడీ కాళ్లు పట్టుకోవడం విలువలు, మర్యాద అయితే జగన్ ఆయన తల్లి పాదాలను బహిరంగంగా తాకుతున్న ఫొటో ఒకటి చూపించగలరా అని నిలదీశారు. లేకపోతే ఇలా పాదాభివందనాలు కేవలం ఢిల్లీ దర్బార్ కే రిజర్వ్ చేసుకున్నారా అని ప్రశ్నించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+