Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో రఘురామ-నేడు టెస్టులు-ఏపీలో ప్రాణహాని ఉందన్న ఎంపీ

వైసీపీ తరఫున గెలిచి సొంత ప్రభుత్వంపై అనుచితవ్యాఖ్యలతో అరెస్టయిన ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎట్టకేలకు నిన్నరాత్రి సికింద్రాబాద్‌ ఆర్మీఆస్పత్రికి చేరారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ఆయన్ను సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రికి తరలించింది. అక్కడ తెలంగాణ ప్రభుత్వం పర్యవేక్షణలో ముగ్గురు సభ్యుల మెడికల్‌ టీమ్‌ ఇవాళ వైద్య పరీక్షలు నిర్వహించబోతోంది.

నిన్న ఆర్మీ ఆస్పత్రికి చేరుకున్న రఘురామను మిలటరీ అధికారులు లోపలికి తీసుకెళ్లారు. లోపలికి వెళ్లే్ముందు అక్కడే వేచి ఉన్న కుటుంబ సభ్యులకు రఘురామ ధైర్యం చెప్పారు. ఆస్పత్రి చెక్‌పోస్ట్‌ వద్ద ఎస్కార్ట్‌ వాహనం దిగి మిలిటరీ అంబులెన్స్‌లో ఆయన లోపలికి వెళ్లారు. మిలిటరీ అంబులెన్స్‌లో ఎక్కేముందు నీరసంగా కనిపించిన రఘురామ అక్కడే కూర్చుండిపోయారు. దంతో ఆయన్ను సైనిక అధికారులు అంబులెన్స్‌లోకి ఎక్కేందుకు సహకరించారు. ఈ సమయంలో సీఐడీ అధికారుల అనుమతి తీసుకుని కుటుంబ సభ్యులు రఘురామతో మాట్లాడారు.

medical tests to ysrcp rebel mp raghurama raju at secunderabad army hospital today

సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రి ప్రాంగణంలో సీఐడీ అధికారుల అనుమతితో కుటుంబ సభ్యులతో మాట్లాడిన రఘురామ ధైర్యంగా ఉండాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఏపీలో తనకు ప్రాణహాని ఉందన్న విషయం మాత్రం చెప్పి లోపలికి వెళ్లిపోయారు. ఇవాళ రఘురామకు వీడియో రికార్డింగ్‌తో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. రిపోర్టును సీల్డ్‌ కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఈ రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్టు తదుపరి నిర్ణయం తీసుకోనుంది.

Recommended Video

    Raghurama Krishnam Raju బర్త్ డే రోజు అరెస్ట్.. Ys Jagan గట్టి దెబ్బ కొట్టాడు!! || Oneindia Telugu

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+