దేశంలోనే అరుదైన ఘనత సాధించిన మెగా బ్రదర్స్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంతో ఇప్పుడు మెగా ఫ్యామిలీ పైన ఆసక్తికర చర్చ జరుగుతుంది. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తారని తాజాగా వచ్చిన ప్రకటన మెగా ఫ్యామిలీ పై చర్చకు కారణమైంది. మెగా ఫ్యామిలీలో ముగ్గురు అన్నదమ్ములు అందరూ మొనగాళ్లే అని ఇప్పుడు మెగా అభిమానులలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.

సినిమాలలో మెగా బ్రదర్స్
మెగా ఫ్యామిలీలో చిరంజీవి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని మెగాస్టార్ గా ఎదిగారు. ఇక మెగాస్టార్ చిరంజీవితో పాటు రాక్షసుడు సినిమాతో నాగబాబు నటుడిగా పరిచయమై పలు చిత్రాలలో హీరోగా నటించాడు. ఆ తర్వాత నిర్మాతగా పలు సినిమాలను తీశాడు. నిర్మాతగా నాగబాబు తీసిన సినిమాలు పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాయి.

Megastar chiranjeevi brothers have achieved a rare record in the country with three minister posts

సినిమాలే కాదు రాజకీయాలలోనూ మెగా బ్రదర్స్
అటు చిరంజీవితోనే కాకుండా ఇటు పవన్ కళ్యాణ్ తో గుడుంబా శంకర్, రామ్ చరణ్ తో తెరకెక్కించిన ఆరంజ్ సినిమాలు కూడా నాగబాబును దెబ్బతీశాయి. ఇక పవన్ కళ్యాణ్ కూడా సినిమాలలో ఎంట్రీ ఇచ్చి హీరోగా సత్తా చాటి పవర్ స్టార్ మార్కును సొంతం చేసుకున్నాడు. ముగ్గురు అన్నదమ్ములు సినీ పరిశ్రమలో తమదైన శైలిలో పనిచేశారు. ఇక రాజకీయాలలో కూడా అందరూ తమ మార్కును నిరూపించుకుంటున్నారు.

ముగ్గురు మంత్రులుగా
మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేయగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా రాజకీయాలలో తన మార్క్ చూపిస్తూ జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు చంద్రబాబు క్యాబినెట్ లోకి చేరనున్నారు. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని స్వయంగా చంద్రబాబు ప్రకటించడం మెగా అభిమానుల్లో సంతోషానికి కారణమైంది.

అరుదైన సంఘటన గా అభిమానులలో హర్షం
మొదటి నుంచి నాగబాబు 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవికి అండగా నిలిచాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెడితే పవన్ కళ్యాణ్ కు అండగా నిలిచి తన వంతు సహకారాన్ని అందించాడు. ఇక ఇప్పుడు నాగబాబుకి కూడా మంత్రి పదవి ఇవ్వనుండడంతో ఒకే ఫ్యామిలీ నుంచి ముగ్గురు సినిమాలలో చేయడం మాత్రమే కాదు రాజకీయాలలోనూ మంత్రులుగా అవకాశం దక్కించుకోవడం అరుదైన సంఘటనగా అభిమానులు భావిస్తున్నారు.

మెగా ఫ్యామిలీలో ముగ్గురు మొనగాళ్ళు
మెగా ఫ్యామిలీ ఈ అరుదైన రికార్డును సొంతం చేస్తుందని కితాబిస్తున్నారు. ఇది మనదేశంలో ఇప్పటివరకు ఏ ఫ్యామిలీ సాధించని అరుదైన రికార్డుగా మెగా అభిమానులు చెబుతున్నారు. ఏది ఏమైనా మెగా ఫ్యామిలీలో ముగ్గురు మొనగాళ్ళు.. ముగ్గురు మంత్రులు అని పెద్ద ఎత్తున చర్చ జరుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+