మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగం.. వెల్కమ్ లిటిల్ మెగా ప్రిన్సెస్!!

మెగా ఫ్యామిలీ లో ఎన్నో ఏళ్ళు తపస్సు ఫలించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. దీంతో మెగా కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. చాలా సంవత్సరాలుగా రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు పిల్లలు లేకపోవడంతో అనేకచోట్ల ఈ ప్రశ్నను ఫేస్ చేయాల్సి వచ్చింది. సోషల్ మీడియాలోనూ ఉపాసన ను టార్గెట్ చేసి వారసులను ఇవ్వడంలేదని విమర్శించిన వారు లేకపోలేదు.

కానీ విమర్శలకు దీటుగా సమాధానం చెప్పిన ఉపాసన అది తన వ్యక్తిగత జీవితం అని, తాము ఏం చేయాలో తమకు తెలుసని అనేకమార్లు మీడియా ముఖంగా చెప్పారు. ఇక ఫైనల్ గా ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలిసిన దగ్గరనుండి, ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ మెగా ఫ్యామిలీలో రాబోయే కొత్తతరం గురించి చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున 01:49 కు మెగా ఫ్యామిలీ లోకి మరో బుజ్జాయి వచ్చింది.

 chirutweet

రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పండంటి ఆడ బిడ్డ పుట్టింది. తమకు మనవరాలు పుట్టడం పై మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన తన ఆనందాన్ని అందరికీ తెలియజేశారు. ఎన్నో ఏళ్ళుగా వేచి చూసిన ఆనంద క్షణాలు ఇవని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.

వెల్కమ్ లిటిల్ మెగా ప్రిన్సెస్ అంటూ తన మనవరాలిని స్వాగతించిన మెగాస్టార్ చిరంజీవి నీ రాకతో మెగా ఫ్యామిలీ లో ఆనందాన్ని తీసుకువచ్చావు అంటూ పేర్కొన్నారు. నీ రాకతో అంతా సంతోషంగా ఉన్నామని తెలియజేశారు. కోట్లాది మంది ఆశీర్వదించిన రామ్ చరణ్ ఉపాసనల కూతురిగా, మమ్మల్ని తాతా నానమ్మలను చేశావు అంటూ చిరంజీవి పేర్కొన్నారు.

అంతేకాదు మెగా ఫ్యామిలీ లోకి యువరాణి ఆగమనం సంతోషంగాను గర్వంగానూ ఉంది అని తెలియజేశారు.ఆంజనేయ స్వామి ఆశీస్సులు తమపై ఎల్లవేళలా ఉన్నాయని పేర్కొన్నారు. ఉపాసన గర్భవతిగా ఉన్నప్పటి నుండి తమ ఇంట్లో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయని తెలిపారు. ఆడబిడ్డ పుట్టుక ఇంటిల్లిపాదికి అపురూపమని మెగాస్టార్ చిరంజీవి తన ఆనందాన్ని తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+