ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ట్విట్టర్ ఖాతా హ్యాక్ .. అశ్లీల చిత్రాలు పోస్ట్ , ఫిర్యాదు చేసిన మంత్రి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ట్విట్టర్ ఖాతా హ్యాకర్ల బారిన పడింది. పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తన ట్విటర్ ఖాతా హ్యాకింగ్ కు గురైందని ఆలస్యంగా గుర్తించారు.

మేకపాటి గౌతమ్ రెడ్డి ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన హ్యాకర్స్ ఆయన ఖాతాలో అశ్లీల చిత్రాలను పోస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది.తన ట్విట్టర్ ఖాతాలో అసంబద్ధమైన పోస్టులు ఆలస్యంగా గుర్తించిన ఆయన వెంటనే వాటిని తొలగించి, తన ట్విటర్ ఖాతా హ్యాకింగ్ పై ట్విట్టర్ సంస్థ కు , సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 Minister Mekapati goutham Reddy Twitter account hacked , offensive content posted by hackers

ఇక ఇదే విషయాన్ని ఆయన మరో పోస్ట్ పెట్టి అందరికీ తెలియజేశారు. తన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారని, అసంబద్ధమైన పోస్టులు పెడుతున్నారని, కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నాను అని ట్వీట్ చేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి, తన ఖాతాలో పోస్ట్ అయిన చెత్త పోస్టులను పట్టించుకోకూడదు అని తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన తన ఫాలోవర్స్ కు , ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇక ఈ విషయంలో ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశానని కూడా ఆయన పేర్కొన్నారు. ఒకపక్క తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్న మేకపాటి గౌతమ్ రెడ్డికి ట్విట్టర్ ఖాతా హ్యాక్ కావడం కాస్త ఇబ్బందికర పరిణామం. రాష్ట్రంలో ఐటీ శాఖ మంత్రి ట్విటర్ ఖాతానే హ్యాక్ చేశారా అంటూ దీనిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

Recommended Video

    భారత పవర్ గ్రిడ్‌పై చైనా కుట్ర.. ముంబై పవర్ కట్ కి అదే కారణమా ? || Oneindia Telugu

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+