Minister roja: నగరిలో మద్దెలదరువులా మంత్రి రోజా పరిస్థితి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోరాటంలో విజయం తమదే అని ఏపీ సీఎం వైఎస్ జగన్ ధీమాతో ఉంటే, మంత్రి రోజా మాత్రం నగరి నియోజకవర్గంలో ఎదురీదుతున్నారు. నగరి నియోజకవర్గంలో రోజా అడుగడుగున ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిన్నటికి నిన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రోజా తీరును నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నేతలు గుడ్ బై చెప్పారు.
రోజాకు సొంత పార్టీ నేతల షాక్
శ్రీశైలం దేవస్థానం మాజీ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, వడమాలపేట జడ్పిటిసి సభ్యుడు మురళీధర్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు రెడ్డివారి భాస్కర్ రెడ్డి, లక్ష్మీపతిరాజు, ఆరుగురు సర్పంచులు, డిసిసిబి మాజీ డైరెక్టర్లు వైసీపీకి రోజా కారణంగా రాజీనామా చేశారు. మంత్రి రోజా తమకు సముచితస్థానం ఇవ్వడం లేదని, వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి తమను దూరం పెట్టారని, ఇప్పటికి ఆమె వైఖరిలో మార్పు లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

రోజా ఓడిపోతారని వ్యాఖ్యలు
నియోజకవర్గంలో మంత్రి రోజా సోదరుల పెత్తనం ఎక్కువైందని, వీరి వలన స్థానిక ప్రజలతో పాటు వైసిపి నేతలు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారు చెప్పారు. రోజాకు టిక్కెట్ ఇస్తే ఓడిపోతారని ముందే చెప్పామని పేర్కొన్నవారు చివరకు రాజీనామా చేశారు. మొత్తం ఐదు మండలాల వైసిపి నేతలు రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు.
ప్రజల్లోనూ రోజాపై వ్యతిరేకత
ఇక ఇదే సమయంలో తాజాగా మరొక సంఘటన చోటు చేసుకుంది. ప్రజలలో కూడా రోజాపైన వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. వడమాల పేట మండలం వేమాపురం గ్రామంలో మంత్రి రోజా ప్రచారాన్ని నిన్న రాత్రి స్థానికులు అడ్డుకున్నారు. పూడి పంచాయతీలోని వేమాపురం గ్రామంలో మంత్రి రోజా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడానికి వెళ్లిన క్రమంలో తమ గ్రామానికి రోజా ఏం మేలు చేశారో చెప్పాలని, ఆ తర్వాతే ఓట్లు అడగాలని వారు ప్రశ్నించారు.
రోజాను నిలదీసిన గ్రామస్తులు
ఏ మొహం పెట్టుకొని తమ గ్రామంలోకి వచ్చి ఓట్లు అడుగుతున్నారని మంత్రి రోజాను నిలదీశారు. దీంతో గ్రామస్తులు, వైసీపీ శ్రేణుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. ఇక గ్రామంలో ప్రచార రథాన్ని తిరగనివ్వకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. పోలీసులు గ్రామస్తులకు నచ్చజెప్పినా వారు వినిపించుకోలేదు. స్థానిక ప్రజలతో మాట్లాడేందుకు ప్రచార రథం పైకి ఎక్కడంతో, గ్రామస్తులు ఇళ్లకు తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు.
ఎదురీదుతున్న రోజా
మంత్రి రోజా చేసేదేమీ లేక ఓ పదినిమిషాలు అక్కడే ఉండి ఆపై వెనుదిరిగారు. ఒకవైపున సొంత పార్టీ నేతల నుంచి, మరోవైపు ప్రజల నుంచి కూడా మంత్రి రోజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న క్రమంలో ఆమె నగరిలో ఎదురీదుతున్నట్టు చర్చ జరుగుతుంది. మంత్రి రోజా గెలుపు కష్టమేనన్న అభిప్రాయం స్థానికంగా వ్యక్తం అవుతుంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications