చంద్రబాబు పరువు తీస్తున్న మంత్రి రోజా!!

చంద్రబాబు నాయుడు.. ఈ పేరు చెప్తేనే వైసిపి ఎమ్మెల్యే, మంత్రి రోజా తనదైన శైలిలో టార్గెట్ చేస్తారు. ఇక తాజాగా చంద్రబాబుకి ఐటీ నోటీసులు ఇచ్చిన వ్యవహారంపై చంద్రబాబును వదిలిపెట్టకుండా విమర్శలు గుప్పిస్తున్న రోజా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ కరప్షన్ కింగ్ చంద్రబాబు నాయుడు అంటూ ఏకిపారేస్తున్నారు.

తాజాగా అమ‌రావ‌తిలో తాత్కాలిక ప్ర‌భుత్వ భ‌వ‌నాల నిర్మాణంలో చంద్రబాబు నాయుడు పుచ్చుకున్న రూ.118.98 కోట్ల ముడుపులు 2019వ సంవ‌త్స‌రం త‌ర్వాత వ‌చ్చిన‌ట్టు తేలింది అని పేర్కొన్న రోజా అంతకుముందు మరింతగా దోచుకున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. 2019కి ముందు 2014 నుంచి 2018 వ‌ర‌కూ డొల్ల కంపెనీల రూపంలో ఎన్ని కోట్ల ప్ర‌జాధనాన్ని దోచుకున్నారో ఈ అబ్బాకొడుకులు? అంటూ రోజా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధించారు.

minister roja shocking comments on chandrababu as corruption king

ఇక ఇదే సమయంలో 2019లో బాబు ఓటమితో కన్సల్టెంట్ కన్నీరు పెట్టుకుందని ఆసక్తికర పోస్ట్ పెట్టిన రోజా కంపెనీలు, బాబుకి మధ్య బ్రోకర్ గా మనోజ్ వాసుదేవ్ పార్థసాని వ్యవహరించారని, అమరావతి నిర్మాణం ముసుగులో బాబుకి వందల కోట్ల లంచం ఇచ్చారని పేర్కొన్నారు.

ఇక ఈ లంచం డబ్బులు వివిధ మార్గాల్లో బాబు జేబులోకి పార్థసాని చేర్చారని, ఆపై 2019లో బాబు ఓడిపోయిన తర్వాత బ్రోకర్ గా వ్యవహరించిన మనోజ్ వాసుదేవ్ పార్థసాని తెగ బాధ పడిపోయారని పేర్కొన్న రోజా , జీవితంలో ఇలా బాధ పడలేదని బాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ కు మెసేజ్ చేశారంటూ తన పోస్టులో వెల్లడించారు.

అంతకుముందు మరో పోస్ట్ పెట్టిన రోజా చంద్రబాబు ముడుపుల కేసులో ధైర్యంగా విచారణ ఎదుర్కొంటాడా? లేక బామ్మర్దిలా మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటాడా? అంటూ సెటైర్లు వేశారు. లేక రామోజీలా మంచం ఎక్కుతాడా? అచ్చెన్నలా రమేష్ ఆస్పత్రిలో చేరతాడా? విజయ్ మల్యాల విదేశాలకు పారిపోతాడా? ఇవన్నీ కాక ఎప్పటిలాగే మరో స్టే తెచ్చుకుంటాడా? అని పలువురు గుసగుసలాడుతున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా రోజా చంద్రబాబును టార్గెట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+