పవన్ కళ్యాణ్ సంస్కారం ముచ్చట్లు.. సన్నీలియోన్ వేదాలు వల్లించినట్లు: మంత్రి రోజా!!
వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన తర్వాత రాష్ట్రంలో రాజకీయం మరింత వేడెక్కింది. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఏపీ మంత్రులు తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటికే మంత్రి రోజా పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో మారు మంత్రి రోజా పవన్ కళ్యాణ్ పై పదునైన విమర్శలు వర్షం కురిపించారు.
అంతే కాదు చంద్రబాబు నాయుడును సైతం టార్గెట్ చేసిన మంత్రి రోజా తనదైన శైలిలో విమర్శించారు. చంద్రబాబు పూనిన చంద్రముఖిలా పవన్ కళ్యాణ్ పిచ్చి గంతులు వేస్తున్నాడని మంత్రి రోజా విరుచుకుపడ్డారు. పవన్ సంస్కారం గురించి చెబుతుంటే సన్నీలియోన్ వేదాలు వల్లించినట్లు ఉందని మంత్రి రోజా తీవ్రవ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రాసిన స్క్రిప్ట్ చదవడమే పవన్ కు తెలుసని, అందుకే పవన్ కళ్యాణ్ ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడని రోజా వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్ ఒక పనికిమాలిన వాడని మంత్రి రోజా మండిపడ్డారు.కరోనా సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు హైదరాబాదులో దాక్కున్నారని, ఇప్పుడు మీకు చప్పట్లు కొడుతున్న వారికి కోవిడ్ సమయంలో సేవలు అందించింది వాలంటీర్ లేనని రోజా పేర్కొన్నారు. చంద్రబాబు సమయంలో జన్మభూమి కమిటీల పేరుతో ఎంతో మోసం జరిగిందని అప్పుడు పవన్ కళ్యాణ్ నోరెందుకు మెదప లేదని రోజా ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ కు చట్టాల గురించి తెలియదని, తెలిసిందంతా చంద్రబాబు ఏం చెప్తే అది చెప్పటమే నని రోజా ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఎవరి మాట వినడు కాబట్టి ఆయనను భార్యలు వదిలేసి పోతున్నారని రోజా పేర్కొన్నారు. వాలంటీర్లు మాత్రమే కాదు బ్యాంకులు, మీసేవ కేంద్రాలు కూడా వివరాలు అడుగుతాయని, డేటా తీసుకుని అక్రమ రవాణా చేస్తున్నారని మోడీని అనగలవా పవన్ అంటూ రోజా నిలదీశారు.
ఎన్సీఆర్ రిపోర్టులో తెలంగాణ టాప్ టెన్ లో ఉందని, అక్కడ మాట్లాడితే కేసీఆర్ మక్కెలు విరగ కొడతాడని భయమా.. పవన్ అంటూ మంత్రి రోజా ఎద్దేవా చేశారు. ఎంతసేపటికి ఎవరు బాగుండ కూడదు అందరూ కష్టాల్లో ఉండాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడా.. అంటూ ప్రశ్నించారు రోజా. పవన్ కళ్యాణ్ ఎంతసేపు మా అమ్మని అన్నారు.. నా భార్య ని తిట్టారు.. నా పిల్లల్ని అంటున్నారు అని ఆయన ఏడుపే కనపడుతుందని రోజా విమర్శలు గుప్పించారు.
-
YS Sharmila : "అవి గొడ్డలి"- జగన్ మావిగాన్ కు షర్మిల షాకింగ్ పంచ్..! -
ఇట్స్ అఫీషియల్: ఓటీటీలోకి 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..!












Click it and Unblock the Notifications