నాగబాబును మోసం చేసిన చంద్రబాబు బానిస; చిరంజీవికి పవన్ కళ్యాణ్ కు పోలికే లేదు!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. తాజాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సమాజానికి ప్రమాదం అంటూ ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కు మతిస్థిమితం లేదని, ఆయనను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి తరలించాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను పవన్ కళ్యాణ్ తరిమికొట్టాలని పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్న ఆయన తరిమితే తాను వెళ్లేవాడిని కాదని, ప్రజాసేవ తన బ్లడ్ లోనే ఉందన్నారు.

అసలు పవన్ కళ్యాణ్ కు తనపై ఎందుకు ఇంత అసూయ ఉందో చెప్పాలని ప్రశ్నించారు. తనను రౌడీ ఎమ్మెల్యే అని విమర్శించిన పవన్ కళ్యాణ్, తనపై కనీసం ఒక క్రిమినల్ కేసు అయినా ఉందేమో చూపించాలని ప్రశ్నించారు గ్రంధి శ్రీనివాస్. పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే పులిలా తిరగబడుతుందని గ్రంధి శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు.

MLA Grandhi srinivas targets Pawan Kalyan over his comments

పవన్ కళ్యాణ్ అడిగితే భీమవరంలో తన పేరున ఉన్న 9 ఎకరాలలో రెండు ఎకరాలు కావాలంటే అమ్మి పెడతానన్నారు. ఇక పవన్ కళ్యాణ్ పక్కనున్న కాపు నాయకులు కూడా ఆయనకు ఎందుకు దూరంగా ఉంటున్నారు అనేది పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలన్నారు. చిరంజీవి సౌమ్యుడు అని, ప్రజారాజ్యం పార్టీలో 18 సీట్లు గెలిచి 80 లక్షల కోట్లు తెచ్చుకున్నాడని గ్రంధి శ్రీనివాస్ గుర్తు చేశారు.

అసలు పవన్ కళ్యాణ్ కు, వివాద రహితుడైన చిరంజీవికి ఏమాత్రం పోలిక లేదన్నారు. పవన్ తన సొంత అన్న నాగబాబుకు కూడా అన్యాయం చేశారని, అందుకే నాగబాబు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారని వ్యాఖ్యానించారు. భీమవరంలో కంపోస్ట్ యార్డ్ కు ఆరుఎకరాల భూమిని తాను సేకరించానని, గతంలో పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న పులపర్తి రామాంజనేయులు, అయితే మున్సిపల్ చైర్మన్ గా ఉన్న కొటికలపూడి గోవిందరావు చేయలేనిది తాను చేశానని గుర్తుచేశారు.

ఇక 2019 ఎన్నికలలో భీమవరం నియోజకవర్గంలో ప్రజలు పవన్ కళ్యాణ్ తరిమి కొట్టారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే పులివెందులలో పోటీ చేయాలంటూ సవాల్ విసిరారు. చంద్రబాబు కాళ్లు చేతులు పట్టుకొని పవన్ కళ్యాణ్ 21 సీట్లు తెచ్చుకున్నారని, జనసైనికుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు.

పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు భీమవరం ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారో పవన్ తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. చంద్రబాబు బానిసలా పవన్ కళ్యాణ్ మారిపోయారని ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+