జగన్ కు జలీల్ ఖాన్ ఛాలెంజ్:ఆ పని చేస్తే రాజీనామా చేస్తా;నీ కాళ్లు పట్టుకుంటా!

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: వైసిపి అధినేత జగన్ కు ఆ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సెన్సేషనల్ సవాళ్లు విసిరారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీని జగన్ ఒక్కసారి విమర్శించగలిగితే తాను జగన్ కాళ్ళు పట్టుకుంటానని ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఛాలెంజ్ చేశారు.

శుక్రవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలనాత్మక సవాళ్లు చేశారు. ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్న జగన్ తన పాదయాత్రలో మోడీని దొంగ, బిజెపి రాష్ట్రాన్ని మోసం చేసింది అని ఒక్క మాట అంటే తన పదవికి రాజీనామా చేస్తానని జలీల్ ఖాన్ సవాలు విసిరారు. ప్రధాని మోడీ పరిపాలన చేతకాక దద్దమ్మలా దీక్ష చేశారని, పార్లమెంట్ ని సజావుగా నడిపించడం చేతకాని మోడీ వెంటనే రాజీనామా చేయాలన్నారు.

MLA jaleel Khan Latest Challenges To YS Jagan
  హోదా అంశాన్ని పక్కదారి పట్టించేందుకే ఆనంద నగరాలు : రోజా

  దేశంలో దళితులు, మైనార్టీల మీద దాడులు జరుగుతున్నా కేంద్రం చోద్యం చూస్తోందన్నారు. ఎపి సిఎం చంద్రబాబు నాయుడు బాధ్యత గల వ్యక్తి కాబట్టి నాలుగేళ్లు ఓపిక పట్టారని, మరి ప్రతిపక్ష నేతగా జగన్ ఈ నాలుగేళ్లు ఏమి చేశాడో చెప్పాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఇన్ కంటాక్స్ కట్టనవసరం లేదని జగన్ చెబుతున్నారని, దీన్నిబట్టి జగన్ కు కనీస జ్ఞానం లేదని తెలుస్తోందన్నారు. అలాంటి జగన్ ముఖ్యమంత్రిగా పనికి వస్తాడా?...అని జలీల్ ఖాన్ ప్రశ్నించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Jaleel Khan, defective MLA, was once again thrown out of the challenges on YCP Chief Jagan. Jalil Khan announced that if Jagan had criticized Prime Minister Modi he would hold the jagan legs and resign his post.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X