నారాయణ...నారాయణ... కామనారాయణ: మళ్ళీ సాయిరెడ్డి షాకింగ్ పోస్ట్!!

మాజీ మంత్రి నారాయణను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టార్గెట్ చేస్తూనే ఉన్నారు. నారాయణ మరదలు ఇటీవల నారాయణ పై చేసిన సంచలన ఆరోపణల తర్వాత, ఘాటుగా స్పందించిన విజయసాయిరెడ్డి మరోమారు మాజీ మంత్రి నారాయణపై, ఆయన తమ్ముడు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తెలుగుదేశం పార్టీ నేత, మాజీమంత్రి నారాయణపై ఆయన తమ్ముడి భార్య కృష్ణప్రియ లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ రాజకీయాల్లో నారాయణపై చర్చ జరుగుతోంది. తనను లైంగికంగా మాజీమంత్రి నారాయణ వేధించారని, 29ఏళ్లుగా తాను నరకం అనుభవిస్తున్నానని, ఇంకా భరించే శక్తి తనకు లేదని పేర్కొన్న నారాయణ మరదలు కృష్ణప్రియ మాజీ మంత్రి నారాయణపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

 MP Vijayasai reddy

దీంతో నారాయణ తమ్ముడు సుబ్రహ్మణ్యం తన భార్య తన అన్నపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించారు. తన భార్య మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిపారు. ఈ కారణంగానే ఆమె సోషల్ మీడియాలో కుటుంబం పరువుకు భంగం కలిగించేలా మాట్లాడారని వెల్లడించారు. అనేకసార్లు కృష్ణ ప్రియను సైకియాట్రిస్ట్ కు చూపించామని తెలిపారు. ఆమె మానసిక పరిస్థితిని అర్థం చేసుకొని ఆమె మాటలను ఎవరు పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

అయితే తాజాగా నారాయణ తమ్ముడు సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలపై స్పందించిన విజయసాయిరెడ్డి డిప్రెషన్ కి పిచ్చికి మధ్య తేడా ఉంటుందని కామ నారాయణ గారి తమ్ముడు తన వీడియోలో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లు కొన్ని చూపిస్తూ వాటిపై డిప్రెషన్ అని స్పష్టంగా రాసి ఉంటే మ్యాడ్ నెస్ అని చెబుతున్నారని, వీడియో చూస్తే అసలు మ్యాడ్ నెస్ అతనికి ఉన్నట్టు అర్థమవుతుందని వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు.. పాపం! మరదలు వరసయ్యే మహిళను మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తూ, వావీ వరస లేకుండా లైంగికంగా వేధిస్తూ, అంతులేని ఆవేదనకు గురిచేస్తున్నారన్నారు. రోజుకు 40 మాత్రలు మింగేలా ప్రోత్సహించి, చివరకు కేన్సర్ బారినపడినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటున్న ఆ మహిళపై అన్న సాగిస్తున్న అకృత్యాన్ని తమ్ముడు సమర్థిస్తున్నాడంటే పతనం ప్రారంభం అయినట్లే అని విజయసాయిరెడ్డి అన్నదమ్ములను టార్గెట్ చేశారు.

అంతేకాదు మరో ట్వీట్ లో నారాయణ కాలేజీల్లో స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకుంటే వారికి డిప్రెషన్ ఉందని, కుటుంబ స్పర్దలు కారణాలని చెప్పి తప్పించుకునేది యాజమాన్యం అంటూ నారాయణ కాలేజీలను టార్గెట్ చేశారు. ఇప్పుడు నారాయణ కుటుంబసభ్యురాలే విస్తుపోయే వాస్తవాలు బయట పెడుతుంటే పిచ్చిదని ఆమోపై ముద్ర వేస్తున్నారు అంటూ మండిపడ్డారు. అరాచకాలు ఎల్లకాలం సాగవు, దుర్మార్గాలకు మూల్యం తప్పదు. నారాయణ...నారాయణ... కామనారాయణ అని విజయసాయిరెడ్డి పోస్ట్ పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+