మరి మా హామీల సంగతేంటి?...చంద్రబాబుకు ముద్రగడ లేఖ

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

తూర్పుగోదావరి: రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారని...మరి చంద్రబాబు తమకు ఇచ్చిన హామీల సంగతేంటని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరో లేఖ రాశారు.

ఈ లేఖలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన పలు విమర్శలు...అనేక ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకహోదాపై మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. చేసిన తప్పులను సరిదిద్దుకోవడం కోసం ఆయన రోజుకో అబద్ధమాడుతున్నారని విమర్శించారు.

Mudragada writes letter to ChandraBabu naidu

చంద్రబాబు ఓటుకు నోటు కేసుకు భయపడి విజయవాడకు పారిపోయి వచ్చిన విషయం నిజం కాదా...? అని ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. ఇప్పటికైనా చంద్రబాబు ఇలాంటి మోసపు మాటలు...చేష్టలు ఆపి కాపులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఈ లేఖలో డిమాండ్ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chief Minister Chandrababu Naidu wants the central government to fulfill AP division promises...And Mudragada questioned about Kapus promises given by chandra babu. Mudragada Padmanabham, fighting for Kapu reservations today wrote letter to AP CM Chandra Babu Naidu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి