తేల్చుకుందాం, రా!: రెచ్చిపోయిన నన్నపనేని, పద్మశ్రీ రెడీ

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: తనపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ చేసిన విమర్శలను ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి తిప్పికొట్టారు. పద్మశ్రీకి దమ్ము, ధైర్యం ఉంటే తనతో బహిరంగ చర్చకు రావాలని ఆమె సవాల్ చేశారు.

మీడియాను పిలిచి వారి ముందే ఎవరేం చేశారో తేల్చుకుందామని అన్నారు. తన కన్నీళ్లను కూడా ఆమె వెక్కిరించిందని నన్నపనేని మండిపడ్డారు. తనను సురభి నాటకాల కంపెనీ ఆర్టిస్టులతో పోల్చిందని ఆమె అన్నారు.

నేను నాటకాలదన్నా..

నేను నాటకాలదన్నా..


తాను మహిళల హక్కుల పరిరక్షణకు నడుం కట్టి పర్యటనలు చేస్తుంటే నాటకాలదాన్నని అన్నారని, సురభి నాటక కంపెనీ చరిత్ర, గొప్పతన పద్మశ్రీకి ఏం తెలుసునని నన్నపనేని అన్నారు. ఈ వయసులో కూడా తాను ప్రజల సమస్యలు తీర్చాలని శ్రమిస్తున్నానని అన్నారు.

వీడియో విడుదల చేసిన పద్మశ్రీ

వీడియో విడుదల చేసిన పద్మశ్రీ


ఇటీవల భీమవరం పట్టణంలో యూత్ ఫెస్టివల్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కొంత మంది మహిళలు అశ్లీల నృత్యాలు చేశారనే విమర్శలు వచ్చాయి. దీనికి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులతోపాటు పార్లమెంటు సభ్యుడి సోదరుడు కూడా హాజరైయారు. ఈ కార్యక్రమాన్ని వీడియో తీశారు. శుక్రవారం సాయంత్రం విజయవాడలో ఆ వీడియోను మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ మీడియాకు విడుదల చేశారు.

నన్నపనేనిపై సంచలన వ్యాఖ్యలు

నన్నపనేనిపై సంచలన వ్యాఖ్యలు

ఆ వీడియో విడుదల చేసిన మీడియా సమావేశంలో సుంకర పద్మశ్రీ - నన్నపనేని రాజకుమారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు కార్యాలయంలో పలువురు వ్యక్తులు పేకాడుతున్న వీడియోలు కూడా మీడియాలో వైరల్ అయినాయి. దీనిపై కూడా సుంకర పద్మశ్రీ వ్యాఖ్యలు చేశారు.

ఆ సవాల్‌ను స్వీకరిస్తున్నా..

ఆ సవాల్‌ను స్వీకరిస్తున్నా..

నన్నపనేని రాజకుమారి విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు సుంకర పద్మశ్రీ శనివారం విజయవాడలో తెలిపారు. ఎక్కడైనా ఎప్పుడైనా ఆమెతో చర్చకు సిద్ధమని ఆమె అన్నారు. నన్నపనేని వయస్సును మాత్రం గౌరవిస్తానని అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh Mahila commission chair person Nannapaneni Rajakumari retaliated Sunkara Padmasri comments.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి