నారా దేవాన్ష్ పుట్టినరోజు: లోకేష్ కుటుంబంతో తిరుమలలో శ్రీవారిదర్శనం; భారీ విరాళం!!
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముద్దుల మనవడు, నారా లోకేష్ బ్రాహ్మణి ల ముద్దుల తనయుడు నారా దేవాన్ష్ పుట్టినరోజు ఈరోజు. నేడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలోని శ్రీవారిని నారా లోకేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు, భువనేశ్వరితో పాటు టిడిపి నాయకులతో కలిసి శ్రీవారి దర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్లారు.
లోకేష్ వెంట శ్రీవారి దర్శనానికి వెళ్లిన టిడిపి నేతలు పుట్టా సుధాకర్ యాదవ్, పుట్టా మహేష్ యాదవ్, అమర్నాథ్ రెడ్డి, కంచెర్ల శ్రీకాంత్ ,అనగాని సత్యప్రసాద్ ,పంచుమర్తి అనురాధ, ఆరణి శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. తిరుమల స్వామివారిని కుటుంబంతో కలిసి దర్శనం చేసుకున్న లోకేష్ దంపతులకు ఆపైన, రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. లోకేష్ ను శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు టీటీడీ అధికారులు.

అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు లోకేష్ కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. నేడు ఉదయం శ్రీవారి భక్తులకు అల్పాహారం వడ్డించి, ఒకరోజు అన్న వితరణకు అయ్యే ఖర్చు 38 లక్షల రూపాయలను టిటిడి ఎస్వి అన్నప్రసాదం ట్రస్ట్ కు లోకేష్ దంపతులు విరాళం ఇచ్చారు.
ఇదిలా ఉంటే ప్రతి సంవత్సరం నారా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా తిరుమలలోని తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన వితరణ కు మొత్తాన్ని తెలంగాణ నారా లోకేష్ కుటుంబం ఇస్తోంది. ఇక నేడు కూడా తరిగొండ వెంగమాంబ అన్నదాన వితరణ కేంద్రంలో దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా ప్రసాద్ వితరణ జరుగుతుంది. అక్కడ బోర్డు పైన ఈరోజు డోనర్ మాస్టర్ నారా దేవాన్ష్ అని డిస్ ప్లే చేశారు.
ఇదిలా ఉంటే నిన్న తిరుమలలో శ్రీవారిని 69 వేల 72 మంది దర్శించుకున్నారు. మొత్తం 26,239 మంది స్వామివారికి తలనీలాలను సమర్పించారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.51 కోట్లుగా ఉంది. 11 కంపార్ట్మెంట్లలో నిన్న స్వామి వారి దర్శనానికి వేచి ఉన్నారు. ప్రస్తుతం స్వామివారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతుంది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications