లోకేష్ పాదయాత్ర పేరు 'యువగళం'- 400 రోజులు-4000 కిలోమీటర్లు- నేడు రూట్ మ్యాప్ రిలీజ్ !
ఏపీలో టీడీపీ యువనేత నారా లోకేష్ సుదీర్ఘ పాదయాత్రకు సిద్దమవుతున్నారు. గతంలో రాష్ట్రంలో సాగిన పాదయాత్రలకు భిన్నంగా, వాటికంటే సుదూర పాదయాత్ర చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టీడీపీని 2024లో అధికారంలోకి తెచ్చేందుకు ఉపకరిస్తుందని భావిస్తున్న ఈ పాదయాత్రకు యువగళం అని పేరు కూడా పెట్టారు. ఈ యువగళం పాదయాత్ర వివరాలను ఇవాళ పార్టీ నేతలు వెల్లడించబోతున్నారు.

నారా లోకేష్ పాదయాత్ర
టీడీపీ ఎమ్మెల్సీ, చంద్రబాబు రాజకీయ వారసుడు నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో వైఎస్, చంద్రబాబు, జగన్ పాదయాత్రలు చేసిన నేలపై ఇప్పుడు లోకేష్ సుదీర్ఘ పాదయాత్ర చేపట్టబోతున్నారు. 2019లో టీడీపీ ఘోర పరాజయం తర్వాత తిరిగి పునర్ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువతను మేల్కొలిపేందుకు లోకేష్ సిద్దమవుతున్నారు. దీంతో జనవరి 27న ఈ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

యువగళం పేరుతో యాత్ర
నారా లోకేష్ చేపట్టే పాదయాత్రకు యువగళం అని పేరు పెట్టారు. గతంలో పాదయాత్రలు చేసిన నేతలంతా ప్రజా ప్రస్ధానం, మరో ప్రస్ధానం వంటి పేర్లను ఎంచుకోగా.. వాటికి భిన్నంగా లోకేష్.. యూత్ టార్గెట్ గా యువగళం అనే పేరు పెట్టారు. ఈ పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉన్న యువతకు చేరువ కావాలని లోకేష్ భావిస్తున్నారు. యువ నేతగా రాష్ట్రంలో తనపై ముద్ర పడాలని కోరుకుంటున్న లోకేష్.. తన పాదయాత్రకు యువగళం అని పేరు పెట్టుకన్నారు. ఇప్పుడు ఈ యువగళం యాత్రకు యువత ఎంతమేరకు కలిసి వస్తుందనే చర్చ నడుస్తోంది.

400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు
కొత్త ఏడాదిలో జనవరి 27న నారా లోకేష్ పాదయాత్ర తన తండ్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రారంభం కానుంది. కుప్పం నుంచి ప్రారంభమయ్యే లోకేష్ పాదయాత్ర సక్సెస్ కోసం పార్టీ ఏర్పాట్లు చేస్తోంది.
లోకేష్ పాదయాత్రకు పేరు, ముహర్తం ఇప్పటికే ఖరారయ్యాయి. ఈ పాదయాత్రలో భాగంగా లోకేష్.. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ 400 రోజుల పాటు 4000 కిలోమీటర్లు నడవబోతున్నారు. ఈ యాత్రకు సంబంధించిన పూర్తి రోడ్ మ్యాప్ ను ఇవాళ పార్టీ నేతలు మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో విడుదల చేయబోతున్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications