గుడివాడ బరిలో నానీకి పోటీగా నారా వారసుడు.. పెరుగుతున్న హీట్..!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటినుంచే వ్యూహ ప్రతి వ్యూహాలతో ఏపీ రాజకీయ పార్టీలు ముందుకు వెళుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్న టీడీపీ రాష్ట్రంలోని కీలక నియోజకవర్గాలలో అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడింది.
ఇదే క్రమంలో ఎమ్మెల్యేగా కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడ నియోజకవర్గం పై టిడిపి ఫోకస్ పెట్టింది. కొడాలి నానీని ఓడించడమే లక్ష్యంగా గుడివాడ పై పావులు కదుపుతున్న తెలుగుదేశం పార్టీ కొడాలి నానిని డీ కొట్టగలిగిన నేత కోసం చాలాకాలంగా అన్వేషిస్తుంది. గుడివాడ నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని భావించిన తారకరత్న వచ్చే ఎన్నికల్లో కొడాలి నానీతో తలపడాలని భావించారు.

నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆపై ఆయన భార్య అలేఖ్య రెడ్డి పేరు తెర మీదకు వచ్చింది. గుడివాడ ఎన్నికల బరిలో అలేఖ్య రెడ్డి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇప్పుడు తాజాగా టీడీపీకి కంచుకోట లాంటి గుడివాడ నియోజకవర్గంలో పునర్వైభవం సంతరించుకోవడం కోసం వ్యూహాలు రచిస్తుంది.
వచ్చే ఎన్నికల్లో విజయాన్ని సాధించడం కోసం టీడీపీ అభ్యర్థిగా యువ హీరో నారా రోహిత్ పేరును పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. చంద్రబాబును పదే పదే టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్న కొడాలి నాని కి చెక్ పెట్టడానికి తమ ఫ్యామిలీ నుండి చరిష్మా ఉన్న ఒక నాయకుడిని రంగంలోకి దింపాలని టిడిపి అధినేత చంద్రబాబు భావిస్తున్న నేపథ్యంలో నారా రోహిత్ పేరు గుడివాడ బరిలో వినిపిస్తుంది.
ఇప్పటికే నారా రోహిత్ సరైన సమయంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని ప్రకటన చేశారు. టిడిపి కూడా గుడివాడ నుంచి రోహిత్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తే నారా రోహిత్ ఎంట్రీ పై టిడిపి అధిష్టానమే కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications