Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చేపల వల, సాంప్రదాయ మత్స్యకార వేషధారణలో అసెంబ్లీకి నరసాపురం ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం వచ్చింది. వైసీపీని ఓడించి టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ సమావేశాలలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. జనసేన పార్టీ నుండి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన బొమ్మిడి నారాయణ నాయకర్ వినూత్న రీతిలో అసెంబ్లీకి వచ్చారు. ఏపీలో తొలి అసెంబ్లీ సమావేశాల్లో తొలిసారి ఎమ్మెల్యేగా అడుగుపెట్టిన నరసాపురం ఎమ్మెల్యే తొలినాడే హల్చల్ చేశారు.

మత్స్యకార వేషధారణలో బొమ్మిడి నారాయణ నాయకర్
జనసేన పార్టీ ఎమ్మెల్యే బొమ్మిడి నారాయణ నాయకర్ మత్స్యకార వేషధారణలో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఈ ఎన్నికలలో నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ముదునూరి ప్రసాద్ రాజు పైన బొమ్మిడి నాయకర్ 49,738 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

Narasapuram MLA Bommidi narayana nayakar went Assembly in traditional fisherman attire

చేపల వలతో, సాంప్రదాయ మత్స్యకారుని వేషధారణలో
బొమ్మిడి నారాయణ నాయకర్ చేపల వలతో, సాంప్రదాయ మత్స్యకారుని వేషధారణలో అసెంబ్లీకి వస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పలు మత్స్యకార సంఘాల నేతలు బొమ్మిడి నారాయణ నాయకర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్న క్రమంలో నినాదాలు చేశారు. ఇక మత్స్యకార వేషధారణలోనే ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టారు.

నరసాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం నుంచి మత్స్యకార ఫ్యామిలీ నుంచి గెలుపొందిన ఈ జనసేన ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగుపెట్టడం అందరినీ ఆకట్టుకుంది.అసెంబ్లీలో ఆయన నరసాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. గత ఎన్నికల్లో ఓటమి చెందిన బొమ్మిడి నారాయణ నాయకర్‌ ఐదేళ్లు ప్రజల మధ్యే ఉన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రజల కోసం పోరాటం చేస్తూ ముందుకు సాగారు.

Narasapuram MLA Bommidi narayana nayakar went Assembly in traditional fisherman attire

అసెంబ్లీలో ప్రత్యేకంగా కనిపిస్తున్న నాయకర్
ఇక ఈ క్రమంలో బొమ్మిడి నారాయణ నాయకర్ ను నరసాపురం ప్రజలు ఆదరించారు. ఒక మత్స్యకార కుటుంబం నుండి వచ్చిన ఆయనను ఎమ్మెల్యే చేశారు. దీంతో ఆయన నేడు మత్స్యకార వేష ధారణలో అసెంబ్లీకి రావటంతో ఆయనపై పెద్ద చర్చ జరుగుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+