ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్: అక్కడ ఏసీ ఫంక్షన్ హాల్ ఒక్క రూపాయికే!

సాధారణంగా పేద, మధ్యతరగతి ప్రజలు శుభకార్యాలు చేసుకోవాలంటే ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకోవటం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అన్ని సదుపాయాలూ ఉన్న ఏసీ ఫంక్షన్ హాల్ కావాలంటే లక్షల రూపాయలే చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఆ ఇబ్బంది లేకుండా మధ్యతరగతి, సామాన్య ప్రజల కోసం నెల్లూరు నగరంలో నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ ఒక ఫంక్షన్ హాల్ కట్టించింది. అది కూడా ఒక రూపాయి అద్దెకే ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

రూపాయి అద్దెకే సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్

నెల్లూరు నగరంలో పేదలు, మధ్యతరగతి వారు తమ శుభకార్యాలు సులభంగా నిర్వహించుకోవడానికి ఒక ప్రత్యేక ఏర్పాటు జరిగింది. నగరపాలక సంస్థ కొత్తగా నిర్మించిన ఫంక్షన్ హాల్‌ను కేవలం రూపాయికే అద్దెకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ హాల్ నిర్మాణం ఇటీవలే పూర్తి కాగా, ఆగస్టు 16న మంత్రి నారాయణ దీన్ని ప్రారంభించారు. అప్పుడే ఈ హాల్‌ను రూపాయి అద్దెకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

Nellore one rupee function hall Municipal Corporation opens a modern air-conditioned function hall for just one rupee to help poor

పూర్తి సెంట్రల్ ఏసీ సౌకర్యంతో, టైల్స్ ఫ్లోరింగ్‌తో ఫంక్షన్ హాల్

పూర్తి సెంట్రల్ ఏసీ సౌకర్యంతో, టైల్స్ ఫ్లోరింగ్‌తో కార్పొరేట్ స్థాయిలో ఈ హాల్‌ను నిర్మించారు. ఈ ఫంక్షన్ హాల్ లో ఐదు వేల మంది వరకు కూర్చునే సామర్థ్యం ఉంది. పార్కింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. నిర్మాణానికి ఎన్‌క్యాప్ నిధుల నుంచి 25 లక్షల రూపాయలు, నగరపాలక సంస్థ నిధుల నుంచి 1.15 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. సాధారణంగా ప్రైవేట్ హాల్స్‌లో అధిక అద్దె చెల్లించాల్సి వస్తుంది.

పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇబ్బంది లేకుండా శుభకార్యాలు

దీనివల్ల చాలా మంది తమ ఆర్థిక స్థితికి తగిన విధంగా కార్యక్రమాలు నిర్వహించుకోలేకపోతున్నారు. ఈ కొత్త ఏర్పాటుతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బంది లేకుండా వివాహాలు, ఇతర శుభకార్యాలు చేసుకోవచ్చు. నగరపాలక సంస్థ ఈ హాల్‌ను ప్రజల సేవలో ఉంచడం ద్వారా సామాజిక బాధ్యతను నిర్వర్తించినట్లు అవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

కొండా సురేఖపై రేవంత్ మౌనం.. చర్యల జాప్యం వెనుక బిగ్ రీజన్స్!
కొండా సురేఖపై రేవంత్ మౌనం.. చర్యల జాప్యం వెనుక బిగ్ రీజన్స్!

పారదర్శక విధానంలో ఫంక్షన్ హాల్ ఇవ్వాలని వినతి

ఇప్పటికే ఈ విషయం నగరవాసుల్లో సంతోషం కలిగించింది. రాబోయే రోజుల్లో మరిన్ని అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు పెంచే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ ఫంక్షన్ హాల్ అవసరం అయిన సామాన్య , మధ్యతరగతి ప్రజలకు ఆన్ లైన్ బుకింగ్ ద్వారా ముందు వచ్చిన వాళ్లకు వరుస క్రమం అనుసరించి కేటాయించాలని, పారదర్శక విధానంలో ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+