సదావర్తి భూముల కేసులో మరో మలుపు: ఆళ్ల రామకృష్ణా రెడ్డికి హైకోర్టులో షాక్, కానీ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/విజయవాడ: సదావర్తి భూముల వ్యవహారం మంగళవారం నాడు మరో మలుపు తిరిగింది. హైకోర్టులో ఈ భూముల వ్యవహారంపై విచారణ జరిగింది.

సదావర్తి భూములపై కొత్త ట్విస్ట్: రూ.10 కోట్లకు ఆళ్ల రెడీ, బాబుకు షాక్

ఇప్పటికే వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి రూ.27.44 కోట్లను చెల్లించారు. కానీ ఆల్ ఇండియా బ్రాహ్మణ అసోసియేషన్ ఈ కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది.

New twist in Sadavarti lands issue

దీంతో మరోసారి ఓపెన్ యాక్షన్ నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆరు వారాల్లో జాతీయ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని చెప్పింది. 

ఆళ్ల చెల్లించిన రూ.27.44 కోట్లను బేస్ ప్రైస్‌గా నిర్ణయించి వేలం నిర్వహించాలని సూచించింది. వేలంలో పాల్గొనేందుకు ఎవరూ ముందుకు రాకపోతే అప్పుడు ఎమ్మెల్యే ఆళ్లకు సదావర్తి భూములు చెందుతాయని హైకోర్టు తేల్చి చెప్పింది.

అనంతరం తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. సదావర్తి భూములకు తాను రూ.27.44 కోట్లు చెల్లిస్తానని, వాటిని తనకు ఇవ్వాలని హైకోర్టుకు ఆళ్ల చెప్పారు. దానికి అంగీకరించడంతో ఆయన డబ్బును ఏపీ ఎండోమెంట్ కమిషన్‌కు చెల్లించారు. ఇప్పుడు బ్రాహ్మణ అసోసియేషన్ ఇంప్లీడ్ పిటిషన్‌తో కొత్త మలుపు తిరిగింది. వేలంలో ఎవరూ ముందుకు రాకుంటే భూములు ఆయనకే చెందుతాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
New twist in Sadavarti lands issue. All India Brahmin Association filed impled petition in High Court over Sadavarti land issue.
Please Wait while comments are loading...