హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇద్దరు మిత్రులు: చిన్ననాటి నుంచి ప్రాణం పోయేవరకు

జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో బుధవారం జరిగిన ఘోర కారు ప్రమాదంలో మృతి చెందిన ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్, వ్యాపారి చినబాబు(కామని బాలమురళీమోహనకృష్ణ) కుమారుడు రాజా రవిచంద్ర చిన్ననాటి నుంచి స్నేహితులు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో బుధవారం జరిగిన ఘోర కారు ప్రమాదంలో మృతి చెందిన ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్, వ్యాపారి చినబాబు(కామని బాలమురళీమోహనకృష్ణ) కుమారుడు రాజా రవిచంద్ర చిన్ననాటి నుంచి స్నేహితులు. వారు కలిసి చదువుకున్నారు. కలిసి తిరిగారు. పార్టీకైనా, మరేదైనా కార్యక్రమమైనా ఇద్దరూ కలిసే వెళ్లేవారు. చివరకు ఇద్దరు కలిసే మరణించడం ఇరుకుటుంబాల్లో పెను విషాదం నింపింది.

మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న బెంజ్ కారు: ఏపీ మంత్రి నారాయణ కుమారుడు మృతిమెట్రో పిల్లర్‌ను ఢీకొన్న బెంజ్ కారు: ఏపీ మంత్రి నారాయణ కుమారుడు మృతి

ప్రముఖుల కుటుంబాల్లో విషాదం నింపిన హైదరాబాద్ రోడ్డు ప్రమాదాలు(పిక్చర్స్)ప్రముఖుల కుటుంబాల్లో విషాదం నింపిన హైదరాబాద్ రోడ్డు ప్రమాదాలు(పిక్చర్స్)

నారాయణ కొడుకు మృతి: కేటీఆర్, లోకేష్ సహా నేతల దిగ్భ్రాంతి, పరామర్శించిన పవన్నారాయణ కొడుకు మృతి: కేటీఆర్, లోకేష్ సహా నేతల దిగ్భ్రాంతి, పరామర్శించిన పవన్

చిన్ననాటి నుంచి ప్రాణం పోయేవరకు

చిన్ననాటి నుంచి ప్రాణం పోయేవరకు

జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో బుధవారం జరిగిన ఘోర కారు ప్రమాదంలో మృతి చెందిన ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్, వ్యాపారి చినబాబు(కామని బాలమురళీమోహనకృష్ణ) కుమారుడు రాజా రవిచంద్ర చిన్ననాటి నుంచి స్నేహితులు. వారు కలిసి చదువుకున్నారు. కలిసి తిరిగారు. పార్టీకైనా, మరేదైనా కార్యక్రమమైనా ఇద్దరూ కలిసే వెళ్లేవారు. చివరకు ఇద్దరు కలిసే మరణించడం ఇరుకుటుంబాల్లో పెను విషాదం నింపింది.

రెండు కుటుంబాల్లోనూ వీరే మగ పిల్లలు

రెండు కుటుంబాల్లోనూ వీరే మగ పిల్లలు

ఆ రెండు కుటుంబాల్లోనూ వీరే మగపిల్లలు కావడంతో కుటుంబ సభ్యులు, స్నేహితుల్లో అంతులేని ఆవేదనను నింపింది. నిషిత్‌ నెల్లూరులో 1994 జులై 4న జన్మించాడు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఇక్కడి నారాయణ విద్యాసంస్థలోనే చదువుకున్నాడు. తొమ్మిది, పది తరగతులు మిర్యాలగూడలోని ఒక ప్రైవేటు పాఠశాలలో చదివాడు. ఇంటర్మీడియెట్‌ బెంగళూరులో పూర్తి చేశాడు.

బాధ్యత కోసం చదువులు

బాధ్యత కోసం చదువులు

నారాయణ విద్యాసంస్థల పర్యవేక్షణ బాధ్యతలను తీసుకోవాలన్న ఆలోచనతో సింగపూర్‌లో బీబీఏ పూర్తి చేశాడు. కాగా, టంగుటూరుకు చెందిన పారిశ్రామికవేత్త కామని బాలమురళీమోహనకృష్ణ, సుభాషిణిల ఏకైక కుమారుడు రాజా రవిచంద్ర. వీరికి లేఖ అనే కుమార్తె ఉన్నారు.

ఆ పరిచయమే ప్రాణ స్నేహం

ఆ పరిచయమే ప్రాణ స్నేహం

రవిచంద్ర 1995లో మే 17న జన్మించాడు. నిషిత్‌, రవిచంద్ర ఇద్దరూ ఇండస్‌ స్కూల్‌లో చదివారు. ఆ పరిచయయే వారిని ప్రాణ మిత్రులను చేసింది. ఆ తర్వాత ఇద్దరూ హైదరాబాద్‌లోనే ఇంటర్నేషనల్‌ బ్యాక్యులరేట్‌ డిప్లొమా ప్రొగాం(ఐబీడీపీ) పూర్తి చేశారు. ఏ వేడుకలైనా ఒకరికొకరు ఖరీదైన కానుకలు ఇచ్చుకునేవారు.

తీరని శోకం

తీరని శోకం

కాగా, తండ్రి కోరిక మేరకు రవిచంద్ర సింగపూర్‌లో బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌(బీబీఏ) పూర్తి చేశారు. చదువు పూర్తికాగానే టంగుటూరులోనే తండ్రి వద్ద ఉంటూ పొగాకు వ్యాపారంలో మెలకువలు నేర్చుకుంటూ ఏడాదిపాటు గడిపారు రవిచంద్ర. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. త్వరలో వ్యాపార బాధ్యతలు అప్పగించాలని తండ్రి బాలమురళీమోహనకృష్ణ భావిస్తున్న తరుణంలో రవిచంద్ర తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం ఆయనకు తీరని శోకం మిగిల్చింది.

English summary
It is said that nishit and raja ravi chandra, who are killed in a road accident, which occurred in Hyderabad on Wednesday early morning, is close friends.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X