వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సిద్ధం: తేల్చేసిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ: విశాఖ రైల్వే జోన్ అంశంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పష్టతనిచ్చారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఆయన మాట్లాడారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉందని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా పేరు లేకపోయినా దానికి సమానంగా అన్నీ చేస్తున్నామని కేంద్రమంత్రి తెలిపారు. హోదా పేరుతో ఏపీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.

ఇటీవల ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గిన ప్రధానికి ఈ సందర్బంగా అభినందనలు తెలిపారు. లోకసభలో అవిశ్వాస తీర్మానం వల్ల దేశంలో చేపట్టిన కార్యక్రమాలపై ప్రజలకు వివరించే అవకాశం లభించిందన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!