వైఎస్ అవినాష్ రెడ్డికి బీజేపీ కేంద్రమంత్రి సర్ ప్రైజ్..! ఏపీలో చర్చ..!

ఏపీ రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్ధితి గత కొన్నేళ్లుగా నెలకొంది. కేంద్రంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఏపీలో ఆ పార్టీ మిత్రపక్షంగా ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని నడుపుతోంది. టీడీపీ తన రాజకీయ ప్రత్యర్థి అయిన వైసీపీపై ఘన విజయంతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే జగన్ ను టీడీపీ ఎంత శత్రువుగా పరిగణిస్తున్న కేంద్రంలో బీజేపీ మాత్రం అలా అనుకోవడం లేదు. అలాగే జగన్ కూడా బీజేపీని శత్రువుగా భావించట్లేదు. ఈ రెండు అంశాలకు నిదర్శనంగా తాజాగా రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ కు ఓటేయాలని కోరుతూ కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ జగన్ కు ఫోన్ చేసి అడిగారు. దీంతో జగన్ కూడ ఎప్పటిలాగే సరేనన్నారు. తనను జైలుకు పంపిన కాంగ్రెస్ తో ఇప్పటికీ శత్రుత్వం కొనసాగిస్తున్న జగన్.. సహజంగానే బీజేపీకి ఈ విషయంలో అండగా నిలిచారు. అదే సమయంలో జగన్ కూ పలు విధాలుగా బీజేపీ సహకరిస్తూనే ఉంది. ఇందులో జగన్ అక్రమాస్తుల కేసులతో పాటు వివేకా కేసు కూడా ఉంది.

Nitin Gadkari s Birthday Wishes to YSRCP MP Avinash Reddy Spark Buzz Amid Ongoing Viveka Case

ఇదే వివేకా కేసులో నిందితుడిగా ఉన్న, సీబీఐ ప్రధాన కుట్రదారుగా భావిస్తున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా బీజేపీ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారెకి పుట్టినరోజు శుభాకాంక్షలు, మీరు చిరకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు గడ్కరీ ఎక్స్ లో పెట్టిన ట్వీట్ లో పేర్కొన్నారు.

Nitin Gadkari s Birthday Wishes to YSRCP MP Avinash Reddy Spark Buzz Amid Ongoing Viveka Case

వాస్తవానికి గడ్కరీ పెట్టిన ట్వీట్ కు పెద్దగా ప్రాధాన్యం ఉండకపోవచ్చు. కానీ ప్రస్తుతం ఏపీలో నెలకున్న పరిణామాల నేపథ్యంలో ఈ ట్వీట్ కు ప్రాధాన్యం ఏర్పడింది. ఓవైపు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోసం సీబీఐ సుప్రీంకోర్టులో పోరాటాలు చేస్తోంది. ఇందులో సీరియస్ నెస్ లేదని మరోవైపు వివేకా కుమార్తె సునీతారెడ్డి ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలో అవినాష్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ గడ్కరీ పెట్టిన ట్వీట్ చూస్తే ఆయనకు కేంద్రంలో ఉన్న పెద్దల ఆశీస్సులు మెండుగానే ఉన్నాయని అర్థమవుతోంది. లేకపోతే గడ్కరీ వంటి బిజీ కేంద్రమంత్రి కేవలం ఏపీలో ఓ విపక్ష ఎంపీకి ఇలా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం లేదని అర్థమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+