కలకలం: శ్రీవారి ఆలయం ఎదుట చిన్నారి కిడ్నాప్, సీసీ టీవీలో కనిపించిన దృశ్యాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయం ఎదుటే చిన్నారి కిడ్నాప్ కు గురవడం కలకలం రేపుతోంది. గొల్లమండపం వద్ద తల్లిదండ్రుల పక్కనే నిద్రిస్తున్న ఏడాది వయసున్న చెన్నకేశవులు అనే బాలుడిని గుర్తు తెలియని వ్యక్తి అపహరించారు.

ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన వెంకటేష్ దంపతులు ఏడాది వయసున్న తమ చిన్నారితో శ్రీవారి దర్శనానికి వచ్చారు. మంగళవారి రాత్రి గొల్లమండపం వద్ద నిద్రించారు.

 One-year-old boy kidnapped at Tirumala

బుధవారం తెల్లవారాక నిద్రలేచి పక్కన తమ చిన్నారి లేకపోవడం గమనించిన దంపతులు భోరుమన్నారు. ఇతర భక్తులు వారిని ఓదార్చే ప్రయత్నం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పడంతో వారు వెంటనే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమీపంలోని సీసీ టీవీ ఫుటేజిలను పరిశీలించగా అందులో చిన్నారి కిడ్నాప్ కు సంబంధించిన దృశ్యాలు కనిపించాయి. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఆ బాలుడిని అపహరించినట్లు తెలుస్తోంది.

కిడ్నాప్ కు పాల్పడిన దంపతులు బస్టాండ్ నుంచి యాత్రికుల వసతి సముదాయం-2 వైపు వెళ్లినట్లు సీసీ టీవీ కెమెరాలు వెల్లడించాయి. సీసీ టీవీ ఫుటేజి దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టామని, చెన్నకేశవులు ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను నియమించామని పోలీసు అధికారులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A one-year-old boy was reportedly kidnapped by an unidentified couple from the pilgrim amenities complex II at Tirumala here on early hours of Wednesday. According to police, the boy Chennakesavulu, son of Venkatesh hailing from Vuravakonda of Anantapur District, was slept along with his parents in pilgrimage. In the morning parents of the boy Chennakesavulu found that their son is missing. Immediately they rushed to nearby police and lodged a complaint. The authorities verified the CC TV footage of the facility and spotted the miscreant carrying away the child. A case have been registered and investigation is on.
Please Wait while comments are loading...