ముసుగు తొలగుతోందా?, పవన్ బీజేపీ సంధించిన బుల్లెట్టే: టీడీపీ ఫిక్స్?
Recommended Video

హైదరాబాద్: నిన్న మొన్నటిదాకా పవన్ ఏం మాట్లాడినా.. మనోడే అంటూ వెనకేసుకొచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు మాత్రం అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. పవన్ వ్యాఖ్యలను ఏమాత్రం ఉపేక్షించవద్దని, అవసరమైతే అతని బలహీనతలను బయటకు లాగాలని పార్టీ శ్రేణులకు చెబుతున్నారు. పవన్ చేసిన అవినీతి ఆరోపణలు పార్టీకి బిగ్ డ్యామేజ్ చేశాయని ఆయన భావిస్తున్నారు.

బీజేపీ సంధించిన బుల్లెట్టే..:
జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడం.. వాటిని బీజేపీ సమర్థించడం.. చంద్రబాబుకు ఉన్న అనుమానాలను బలపరిచేదిగా మారింది. టీడీపీ బలహీనపరిచేందుకే పవన్ కల్యాణ్ ముసుగు రాజకీయాలు చేస్తున్నారని ఆయన భావిస్తున్నారు. ఇప్పుడిప్పుడే పవన్ ముసుగు తొలగుతోందని.. ఆయన బీజేపీ సంధించిన బుల్లెట్టే అని టీడీపీ శ్రేణులకు ఒక అంచనాకు వస్తున్నాయి.

నిజంగా ఆధారాలున్నాయా?..:
తాను చేసిన అవినీతి ఆరోపణలకు తన వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయి అంటున్నారు పవన్ కల్యాణ్. నిరాధారంగా తానేమి గాలి వ్యాఖ్యలు చేయలేదని అంటున్నారు.
సందర్భం వచ్చినప్పుడు వాటిని బయటపెడుతానని అంటున్నారు. అయితే ఆ సందర్భం ఎప్పుడు?.. అసలా సందర్భం వస్తుందా?.. లేక టీడీపీ ఆరోపిస్తున్నట్టుగా కేవలం వారిపై బురద జల్లేందుకేనా ఇదంతా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

టీడీపీ లొసుగుల్ని లాగే పనిలో..:
పవన్ కల్యాణ్ చేసిన అవినీతి ఆరోపణలతో అటు బీజేపీ కూడా దూకుడు పెంచింది. రాష్ట్రంలో జరిగిన అవినీతిపై ఇప్పటికే ఆ పార్టీ లెక్కల్ని బయటతీసే పనిలో నిమగ్నమైనట్టు ప్రచారం జరుగుతోంది. ఎలాగు పవన్ ముందు పడ్డాడు కాబట్టి.. ఆయన్ను అడ్డుపెట్టుకుని టీడీపీ లొసుగులన్ని బయటకు లాగాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

పవన్ ఆరోపణలను నమ్ముతున్నారా?:
రాష్ట్రంలో ఇప్పుడు టీడీపీ తీవ్రమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. జనసేన, వైసీపీ, బీజేపీ.. ఈ మూడింటికి ఆ పార్టీ లక్ష్యంగా మారడంతో.. ఊపిరి సలపనంత ఇరకాటంలో పడ్డారు చంద్రబాబు. అయితే ఇదంతా చంద్రబాబు స్వయంకృతాపరాధమే అనేవారు లేకపోలేదు.
సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబును వెనకేసుకొచ్చిన పవన్.. అకస్మాత్తుగా ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారంటే.. అందులో ఎంతో కొంత నిజం లేకపోలేదు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. టీడీపీ తీరు మారకపోవడం వల్లే ఆయన సహనం నశించిందని, అందుకే బహిరంగంగానే ఆరోపణలు చేశాడని అంటున్నారు.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications