చంద్ర మోహన్ మృతిపట్ల పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే!!
విలక్షణ నటుడు, ఏ పాత్ర చేసిన ఇట్టే ఒదిగిపోయే చంద్రమోహన్ ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. నటుడు చంద్రమోహన్ మృతితో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చంద్రబాబును మృతి పట్ల పలువురు సినీ దిగ్గజాలు, రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
చంద్రమోహన్ మృతి పట్ల స్పందించిన జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు .చంద్రమోహన్ మరణ వార్త విని ఆవేదన చెందినట్టు ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. చంద్రమోహన్ లాంటి నటుడు సినీ పరిశ్రమలో ఉండడం మన కళామతల్లి చేసుకున్న అదృష్టమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

ఆయనను తెరపై చూస్తే మనకు ఎంతో పరిచయమైన వ్యక్తినో, మన బంధువునో చూసినట్లు అనిపిస్తుందని, అందరికీ అంత సన్నిహితంగా ఉండే వ్యక్తి మాదిరిగా చంద్రమోహన్ కనిపిస్తాడని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సినీ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన తనదైన నటనను కొనసాగించారని కితాబిచ్చారు. చంద్ర మోహన్ పదహారేళ్ళ వయసు, సిరిసిరిమువ్వ, సీతామాలక్ష్మి, రాధా కళ్యాణం లాంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.
తాను కూడా చంద్రమోహన్ తో సినిమాలు చేశానని పేర్కొన్న పవన్ కళ్యాణ్, తన మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో మంచి పాత్ర పోషించారన్నారు. తన అన్నయ్య చిరంజీవితో కలిసి చంటబ్బాయి, ఇంటి గుట్టు వంటి చిత్రాలలో నటించినట్టు పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు.
ఇక తమ్ముడు సినిమాలో కూడా తనతో కలిసి నటించాడని పేర్కొన్న ఆయన మా ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్ ని బాగా అలరించాయని గుర్తు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఇక చంద్రమోహన్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications