పవన్ రియల్ లైఫ్ హీరో కాదు.. రియల్ లైఫ్ లో సీఎం కాలేడు-మంత్రి రోజా కామెంట్స్

ఏపీలో టీడీపీ, జనసేన మధ్య పొత్తు కోసం జరుగుతున్న ప్రయత్నాలపై ఇవాళ వైసీపీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తీరును విమర్శిస్తూ రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ను సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలంటూ జనసేన నేతలు కోరుతున్న నేపథ్యంలో రోజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి ఆర్కే రోజా ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ రీల్ హీరో, ఆయన రియల్ లైఫ్ లో హీరో కాదు.. రియల్ లైఫ్ లో పవన్ సీఎం కాలేడు అంటూ రోజా వ్యాఖ్యానించారు. ఇవాళ తిరుపతిలో వైయస్సార్ యంత్ర సేవా పథకం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రోజా.. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ట్రాక్టర్లు పంపిణీ చేశారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

pawan kalyan is neither real life hero, nor become real life cm-ap minister roja comments

ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు ఏ మాత్రం లేదని, వారికి కావాల్సింది అధికారమే అంటూ రోజా విమర్శించారు. పొత్తులు పెట్టుకొని ఎన్నికలకు వచ్చినంతమాత్రాన వైసీపీని ఎవరూ ఏం చేయలేరని, ప్రజలంతా సీఎం జగన్ కు మద్దతుగా నిలుస్తున్నారని రోజా తెలిపారు.

మరోవైపు నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ కు సీఎం అయ్యే సీన్ లేదని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజలకు స్పష్టంగా చెబితే ఎవరైనా సీఎం కావొచ్చంటూ వ్యాఖ్యానించారు. వైసీపీని ఎదుర్కోలేక చంద్రబాబు తంటాలు పడుతున్నాడని, ప్రజలంతా జగన్ వెంట ఉండటం చూసి చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని రోజా ఆరోపించారు. పొత్తుల పెట్టుకున్నంత మాత్రాన వైసీపీని ఎవరు ఏం చేయలేరని, సింగల్ గానే సీఎం జగన్ ఆధ్వర్యంలో ప్రజల్లోకి వెళ్తామని, వచ్చే ఎన్నికల్లో 160 స్థానాలు మావేనని మంత్రి రోజా అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+